అమ్మ ఒడి మూవీ ట్రైలర్ విడుదల

Published On: February 5, 2024   |   Posted By:

అమ్మ ఒడి మూవీ ట్రైలర్ విడుదల

జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన అమ్మ ఒడి చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన స్పందన

జ్యోతిక ప్రధాన పాత్రలో ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన తమిళ చిత్రం రాక్షసి. ఐదేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో అమ్మ ఒడి టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను ఏపీ తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా సోమవారం తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే టీచర్ గా జ్యోతిగా కనిపిస్తున్నారు. పాడైపోయిన స్కూళ్లను.. పునరుద్దించాలనుకునే పాత్రలో జ్యోతిక నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. నాగినీడు హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా వడ్డి రామానుజమ్, వల్లెం శేషారెడ్డి మాట్లాడుతూ..తెలుగు ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉంది. విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను చూపించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ రాజ్ అద్భుతంగా రూపొందించారు. డబ్బింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అని చెప్పారు.

నటీనటులు :

జ్యోతిక, నాగినీడు, హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్, సత్యన్.

సాంకేతిక వర్గం :

మాటలు, పాటలు : భారతి బాబు పి
దర్శకులు : ఎస్ వై గౌతమ్ రాజ్
బ్యానర్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు : ఎస్ ఆర్ ప్రకాష్, ఎస్ ఆర్ ప్రభు, వడ్డి రామానుజం వల్లెం శేషారెడ్డి