అశ్విన్ బాబు చిత్రం టైటిల్ శివం భజే

Published On: March 12, 2024   |   Posted By:

అశ్విన్ బాబు చిత్రం టైటిల్ శివం భజే

యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్ర టైటిల్ ఈ రోజు ప్రకటించారు.

గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘శివం భజే’ అని టైటిల్ పెట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శించింది.

బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ”అశ్విన్ హీరోగా ఒక వైవిధ్యమైన కథతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంగా ‘శివం భజే’ తెరకెక్కుతుంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. కామెడీ, డ్రామా, యాక్షన్ థ్రిల్స్ తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, తమిళ విలన్ సాయి ధీనా, హైపర్ ఆది ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకుని భారీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు.

దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, ” మా కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ‘శివం భజే’ దొరకడం చాలా సంతోషంగా ఉంది. 80% షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నాం. మా హీరో అశ్విన్ బాబు, బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, తమిళ నటుడు సాయి ధీనా, హైపర్ ఆది, మా నిర్మాత మహేశ్వర రెడ్డి గారు చాలా సహకరించారు. సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అన్నారు.

నటీనటులు: అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, సాయి ధీన, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు.

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,
మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస
ఫైట్ మాస్టర్: పృథ్వి
డీవోపీ : దాశరథి శివేంద్ర,
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి,
దర్శకత్వం : అప్సర్.