అసలేం జరిగింది సినిమా జ్యూక్ బాక్స్ విడుదల

ఎక్సోడస్ మీడియాసంస్థ నిర్మించిన అసలేం జరిగింది సినిమా జ్యూక్ బాక్స్ ను ఆదిత్యా మ్యూజిక్మంగళవారం విడుదల చేసింది. విజయ్ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, భార్గవి పిళ్లై, మాళవిక, రాంకీ తదితరులు ఆలపించిన పాటలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర నిర్మాత కె.నీలిమా తెలిపారు.

విజయ్ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవికలు ఆలపించిన పాటలు మెలోడియస్గా ఉన్నాయని, విజయ్ ఏసుదాస్ చాలా రోజులతర్వాత తెలుగులో పాడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ ప్రతిఒక్కర్ని ఆకట్టుకుంటుందన్నారు.

తెలంగాణలో చిత్రీకరించిన ఈ సినిమా పాటల్నితెలంగాణఅవతరణ దినోత్సవం సందర్భంగావిడుదల చేయడంఆనందంగాఉందన్నారు. ఈ సినిమాకుమహావీర్ మ్యూజిక్ అందించారు. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మీ, చిర్రావూరి విజయ్ కుమార్, వెంకటేష్ తదితరులుపాటల్ని రచించారు. దర్శకత్వ బాధ్యతల్ని ఎన్ వీ ఆర్ చేపట్టారు.

రోజాపూలు, ఒకరికిఒకరు, తరువాత తెలుగులో మళ్ళీ నాకు ఆ స్థాయి గుర్తింపును తీసుకొచ్చే చిత్రం అసలేం జరిగింది.  కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది అన్నారు కథానాయకుడు శ్రీరామ్. తెలుగులో కొంత విరామ తర్వాత హీరో శ్రీరామ్ నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రంలో శ్రీరామ్ సరసన కన్నడ భామ సంచితా పదుకునే నాయికగా నటిస్తోంది. ఎక్సోడస్ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ ఎన్‌వీఆర్  దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. కాగా ఈ చిత్రంలోని పాటల జ్యూక్ బాక్స్‌ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా విడుదల చేశారు.  ఈ సందర్భంగా  నిర్మాత చిత్ర విశేషాలను  తెలియజేస్తూ  చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా విజయ్‌ఏసుదాస్ చాలా రోజుల తర్వాత తెలుగులో పాడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకునే విధంగా వుంది. తెలంగాణలో చిత్రీకరించిన ఈ పాటలను తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం ఆనందంగా వుంది. మహావీర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మీ, చిర్రావూరి విజయ్‌కుమార్,వెంకటేష్ తదితరులు పాటల్నీ రచించారు.విజయ్‌ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవికలు పాటలు ఆలపించారు. గ్రామీణ నేపథ్యంలో  కొనసాగే ఒక సస్పెన్స్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు.