ఆకాశం మూవీ టైటిల్‌ విడుదల
వయాకామ్‌ 18 స్టూడియోస్‌, రైస్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో అశోక్‌ సెల్వన్‌ నటించిన ‘ఆకాశం’
బాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు అందిస్తున్న వయాకామ్‌ 18 స్టూడియోస్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియనివారు ఉండరు. కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాల్‌ విజయం తర్వాత వయాకామ్‌18 స్టూడియోస్‌ దక్షిణాదిన బై లింగ్వుల్‌ సినిమా తెరకెక్కించింది. అశోక్‌ సెల్వన్‌ నటించిన ఈ సినిమాకు తమిళంలో ‘నిత్తమ్‌ ఒరు వానమ్‌’ అనే పేరు పెట్టారు. తెలుగులో ‘ఆకాశం’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు.
క్లీన్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌ని తెరకెక్కించాలనే సంకల్పంతో ఉన్న రైస్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించారు.
ప్రతి సినిమాతోనూ తన కెరీర్‌ గ్రాఫ్‌ని పైపైకి ఎదిగేలా చూసుకుంటున్న అశోక్‌ సెల్వన్‌ నటించిన సినిమా ఇది. ఫీల్‌ గుడ్‌ ట్రావెలాగ్‌ని కొత్త దర్శకుడు రా.కార్తీక్‌ తెరకెక్కించారు. రీతు వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్‌ ఇందులో నాయికలు. వీరితో పాటు ప్రముఖ నటీనటులు పలువురు ఈ సినిమాలో నటిస్తున్నారు.
తెలుగులో ఆకాశం, తమిళ్‌లో నిత్తమ్‌ ఒరు వానమ్‌ అనే టైటిల్‌ని దుల్కర్‌ సల్మాన్‌ విడుదల చేశారు.
తెలుగు, తమిళ్‌లో ఒకేసారి తెరకెక్కించిన చిత్రమిది.
చెన్నై, హైదరాబాద్‌, మనాలి, వైజాగ్‌, గోవా, ఢిల్లీ, చండీఘడ్‌, కోల్‌కతా, పొల్లాచ్చి తదితర ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.
 గోపీసుందర్‌ సంగీతం అందించారు. విధు అయ్యన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆంటనీ ఎడిటింగ్‌ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌, ఆడియో రిలీజ్‌ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తారు.
సాంకేతిక నిపుణులు
నిర్మాతలు: శ్రీనిధి సాగర్‌ (రైస్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌), వయాకామ్‌ 18 స్టూడియోస్‌
దర్శకత్వం: రా.కార్తీక్‌
కెమెరా: విధు అయ్యన
సంగీతం: గోపీ సుందర్‌
ఎడిటర్‌: ఆంటనీ
స్టంట్‌: విక్కీ
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎస్‌.వినోద్‌కుమార్‌
లిరిక్స్: కార్తిక నెల్సన్‌