ఆపరేషన్ వాలెంటైన్ మూవీ డబ్బింగ్ ప్రారంభం

Published On: September 14, 2023   |   Posted By:

ఆపరేషన్ వాలెంటైన్ మూవీ డబ్బింగ్ ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ఆపరేషన్ వాలెంటైన్ డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమాలతో ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నారు.

ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, వీఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు అత్యుత్తమ అవుట్‌పుట్, గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం టీమ్ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంది.అక్టోబర్ 8 ఎయిర్‌ఫోర్స్ డే రోజున సర్ ప్రైజ్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

హిందీ ,తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ విజువల్ వండర్ తో వరుణ్ తేజ్ హిందీ లో అడుగుపెడుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు.