ఆమె సినిమా జులై విడుద‌ల‌

 

జులై 19న అమ‌లా పాల్ ఆమె సినిమా విడుద‌ల‌..

సెన్సేష‌న‌ల్ హీరోయిన్ అమ‌లా పాల్ న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ సినిమా ఆమె. ఆడై సినిమాకు తెలుగు వ‌ర్ష‌న్ ఇది. భిన్న‌మైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమ‌లా పాల్ బోల్డ్ లుక్ కూడా సంచ‌ల‌నం సృష్టించింది. జులై 19న ఆమె సినిమా విడుద‌ల కానుంది. ప్ర‌దీప్ కుమార్ ఆమె చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజ‌య్ కార్తిక్ ఖ‌న్న‌న్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ ఈ చిత్ర తెలుగు హ‌క్కులను సొంతం చేసుకున్నారు. చ‌రిత్ర చిత్ర ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో ఆమె చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

న‌టీన‌టులు: అమ‌లా పాల్

టెక్నిక‌ల్ టీం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: ర‌త్నకుమార్
నిర్మాత‌లు: రాంబాబు క‌ల్లూరి, విజ‌య్ మోర‌వెనేని
స‌హ నిర్మాత‌:  J. ఫ‌ణీంద్ర కుమార్
సంగీతం: ప‌్ర‌దీప్ కుమార్, ఊర్క‌
సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ కార్తిక్ ఖ‌న్నన్
మాట‌లు: రాజేష్ A మూర్తి
లిరిక్స్: భువ‌న చంద్ర
సౌండ్ డిజైన్: స‌ంప‌త్ అల్వార్ (MPSE)
సౌండ్ మిక్స్: T. ఉద‌య్ కుమార్
ఆర్ట్ డైరెక్ట‌ర్: విదేశ్
స్టంట్స్: స‌్ట‌న్న‌ర్ స్యామ్
కాస్ట్యూమ్ డిజైన‌ర్: క‌విత J
ప‌బ్లిసిటీ డిజైన‌ర్: అముధ‌న్ ప్రియ‌న్
క‌ల‌రిస్ట్: G బాలాజీ
VFX ప్రొడ్యూస‌ర్: హ‌రిహ‌ర‌సుథ‌న్
డాన్స్ కొరియోగ్ర‌ఫ‌ర్: M ష‌రీఫ్, అబు
PRO: వ‌ంశీ శేఖ‌ర్