ఆరంభం మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ అనగా విడుదల

Published On: March 2, 2024   |   Posted By:

ఆరంభం మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ అనగా విడుదల

యంగ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా ఎమోషనల్ థ్రిల్లర్ ఆరంభం ఫస్ట్ లిరికల్ సాంగ్ అనగా అనగా.. రిలీజ్

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఆరంభం. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ అనగా అనగా. యంగ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఆరంభం సినిమా టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఇప్పుడే చూశాను. టీజర్, సాంగ్ చాలా బాగుంది. ఫ్రెష్ గా అనిపించాయి. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. చూడగానే నేను ఇంప్రెస్ అయినట్లే థియేటర్ కి వచ్చే ఆడియెన్స్ కు కూడా ఆరంభం సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్..మిగతా వాళ్లు అంతా యంగ్ టీమ్ ఈ సినిమాకు పనిచేశారు. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

అనగా అనగా పాటకు స్వరూప్ గోలి లిరిక్స్ అందించగా..ఎస్ పి చరణ్ పాడారు. సింజిత్ ఎర్రమిల్లి క్యాచీ ట్యూన్ తో పాటను కంపోజ్ చేశారు. వాలే పొద్దుల్లో పాడిందే పాట, చుట్టేస్తుంటారే ఈ ఊరంతా..హద్దే లేకుండా ఆడిందే ఆట, లేదే బేజారంట.. సాగే మేఘాలే దారే మారాయే, చూసొద్దామా ఈ సరదాలంటూ, వీచే గాలుల్నే అటుగా తిప్పాయే, రారా ఓ సారంటూ..మది పాడే ఈ సంగీతం దరి రాదే ఏ సంకోచం, మరి మీదే ఈ సల్లాపం, అంటూ సాగిందే మీ పయనం. అనగా అనగా అనగా పదాలే..కలిపావంటే ఒకటై పోవా..అంటూ ఒక ఊరి నేపథ్యంగా ఆహ్లాకరంగా సాగుతుందీ పాట. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది

నటీనటులు :

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు

టెక్నికల్ టీమ్ :

ఎడిటర్ : ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ : దేవ్ దీప్ గాంధీ కుందు
మ్యూజిక్ : సింజిత్ యెర్రమిల్లి
బ్యానర్ : ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ : అభిషేక్ వీటీ
దర్శకత్వం : అజయ్ నాగ్ వీ