ఇంటి నెం.13 చిత్రం షూటింగ్‌ పూర్తి


‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ వంటి డిఫరెంట్‌ సస్పెన్స్‌ హారర్‌ థ్రిల్లర్స్‌ను రూపొందించి డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పన్నా రాయల్‌. ఇప్పుడు ‘ఇంటి నెం.13’ చిత్రంతో హ్యాట్రిక్‌ సాధించేందుకు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మిస్టరీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై హేసన్‌ పాషా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది.


ఈ సందర్భంగా దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ ‘‘నేను చేసిన రెండు సినిమాలను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఆ సినిమాలతో దర్శకుడిగా నాకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ ఉత్సాహంతోనే మరో విభిన్న కథాంశంతో ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. గతంలో హారర్‌ సినిమాలు, హారర్‌తో కామెడీ మిక్స్‌ చేసిన సినిమాలు చాలా వచ్చాయి. కానీ, మిస్టరీ బేస్డ్‌ మూవీస్‌ ఈమధ్యకాలంలో రాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఓ మిస్టరీ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. టెక్నికల్‌గా హై రేంజ్‌లో ఉంటేనే ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అందుకే ఈ సినిమాను టెక్నికల్‌గా హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌తో క‌లిసి ఓ విజువ‌ల్ వండ‌ర్‌లా రూపొందిస్తున్నాం. ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ వినోద్‌ యాజమాన్య అద్భుతమైన పాటలు చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అంతకంటే బాగా చేస్తారన్న నమ్మకం ఉంది. ఈ సినిమా నేను అనుకున్న విధంగా రావ‌డానికి నిర్మాత హేస‌న్ పాషాగారు ఎంతో స‌పోర్ట్ చేస్తున్నారు. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా ఎంతో లావిష్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి నాకు హ్యాట్రిక్‌ని అందిస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను’’ అన్నారు.


నిర్మాత హేసన్‌ పాషా మాట్లాడుతూ ‘‘పన్నాగారు ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు చూశాను. నాకు చాలా బాగా నచ్చాయి. ఈమధ్యకాలంలో రాని ఓ డిఫరెంట్‌ పాయింట్‌తో సినిమా చేస్తే బాగుంటుందని మేం అనుకున్నాం. పన్నాగారు చెప్పిన పాయింట్‌తో సినిమా చేస్తే డెఫినెట్‌గా సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకం కలిగింది. ఫుటేజ్‌ చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగింది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సినిమాను నడిపించడంలో పన్నాగారు హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తేవ‌డ‌మే కాకుండా మా రీగ‌ల్ ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌కు ప్రెస్టీజియ‌స్ మూవీ అవుతుంద‌న్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను’’ అన్నారు.


నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని, గుండు సుద‌ర్శ‌న్‌, శ్రీ‌ల‌క్ష్మి, గీతాసింగ్‌, శ్రీ‌సుధ‌, ల‌క్ష్మీకిర‌ణ్‌, బేబి సిధీక్ష‌, మాస్ట‌ర్ స్నేహిత్‌, విజ‌య్‌కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌,  ఎడిటింగ్‌: ఎస్‌.కె.చలం, మాటలు: వెంకట్‌ బాలగోని, పాటలు: రాంబాబు గోశాల, సింగ‌ర్స్‌: శ్రీ‌యా గోష‌ల్‌, మాల్గాడి శుభ‌, ఐశ్వ‌ర్య‌, వినోద్ యాజ‌మాన్య‌, నిర్మాత: హేసన్‌ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌.