ఇండియన్ 2 మూవీ ఇంట్రో గ్లింప్స్‌ నవంబర్ 3 విడుద‌ల

Published On: November 3, 2023   |   Posted By:

ఇండియన్ 2 మూవీ ఇంట్రో గ్లింప్స్‌ నవంబర్ 3 విడుద‌ల

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్, లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ భారీ చిత్రం ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్‌ను విడుద‌ల చేయనున్న సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్ లాల్‌, స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, కిచ్చా సుదీప్‌

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్, ఉద‌య‌నిధి స్టాలిన్‌ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఇండియన్ 2. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లైన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ఇండియన్ సినిమాకు ఇది సీక్వెల్‌. శంక‌ర్ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌తీ విష‌యాన్ని ఆయ‌న ఓ బ్ర‌హ్మాండంగా చూపిస్తారు. అలాంటి ఓ డైరెక్ట‌ర్‌కి లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ వంటి ప్యాషనేట్ ప్రొడ్యూస‌ర్ దొరికితే ఎలా ఉంటుందనేది ఇండియన్ 2 సినిమాతో ప్రూవ్ కానుంది. అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వ‌ర్గాలు ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 3న ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు.

ఎవరూ ఊహించని రీతిలో శంక‌ర్ వావ్ అనేలా ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్ రిలీజ్‌ను ప్లాన్ చేశారు. పాన్ ఇండియా మూవీగా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్‌ను ఐదు భాష‌ల్లో ఐదుగురు అమేజింగ్ స్టార్స్ విడుద‌ల చేస్తున్నారు. త‌మిళంలో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌, హిందీలో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్‌, మ‌ల‌యాళంలో కంప్లీట్ యాక్ట‌ర్‌ మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ‌లో కిచ్చా సుదీప్, తెలుగులో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు.

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఇండియన్ 2లో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆర్‌.ర‌త్న‌వేలు, ర‌వివ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.