ఉషా ప‌రిణయం చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

Published On: February 15, 2024   |   Posted By:
ఉషా ప‌రిణయం చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

వాలంటైన్స్ డే కానుక‌గా బ్యూటిఫుల్ ల‌వ్‌స్టోరి ఉషా ప‌రిణయం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల
తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు.
నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం  బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌.
క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు  శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా,   తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది.
వాలంటైన్స్ డే సంద‌ర్బంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.
ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన చిత్రీక‌ర‌ణ‌తో టాకీపార్ట్ పూర్త‌యింద‌ని, త్వ‌ర‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ‌కు విదేశాల‌కు వెళుతున్నాన‌మ‌ని చిత్ర యూనిట్  తెలిపింది.
శ్రీ‌క‌మ‌ల్, తాన్వి ఆకాంక్ష‌, సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌, అలీ,  వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: స‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ వ‌ర్మ‌, ద‌ర్శ‌క‌త్వం-నిర్మాత :
కె.విజ‌య్‌భాస్క‌ర్