ఏజెంట్ మూవీ రివ్యూ

Published On: April 28, 2023   |   Posted By:

ఏజెంట్ మూవీ రివ్యూ

అఖిల్ ఏజెంట్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

👎

అఖిల్ దాదాపు రెండు సంవత్సరాల విరామ తర్వాత ‘ఏజెంట్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్, టీజర్ లలో  స్పై గా కొత్తగా కనపడుతూ ఆకట్టుకున్నాడు, దీనికి తోడు  సురేందర్ రెడ్డి ఈ సినిమాని డైరక్టర్ చేయటం, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా ప్రత్యేక పాత్రలలో నటించటంతో ఎక్సపెకేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తోడు మాస్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతున్న అఖిల్ కెరీర్ లో ఈ సినిమా చాలా ముఖ్యమైనది. దీనికోసం సిక్స్ ప్యాక్ చేసి మరీ  అఖిల్ చాలా కష్టపడ్డాడు కూడా. ఈ క్రమంలో రిలీజైన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది… అసలు కథేంటి ..అఖిల్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లిందా వంటి విషయాలు చూద్దాం.

కథాంశం :

రామకృష్ణ అలియాస్ రిక్కీ అలియాస్ వైల్డ్  (అక్కినేని అఖిల్) జీవితాశంయ ఒక రా ఏజెంట్ అవ్వాలని. తాను రా ఏజెంట్ అవ్వడానికి చేసే ప్రతీ ప్రయత్నం ఫెయిల్ అవుతూంటుంది.చివరగా ‘రా’ చీఫ్ డెవిల్ అలియాస్ మహాదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్స్ ని హ్యాక్ చేసి అతని దృష్టిలో పడతాడు. ఆ సమయంలో  డెవిల్…ఓ ఆపరేషన్ లో ఉంటాడు. గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియా) దేశానికి వినాశనంగా తయారయ్యాడని అతన్ని కంట్రోలు చేసేందుకు తన ఏజెంట్స్ ని పంపుతూంటాడు. కానీ వాళ్లెవరూ సక్సెస్ కారు. అప్పుడు డెవిల్ కు ఓ ఆలోచన వస్తుంది. దాదాపు కోతిలా ఎప్పుడు అల్లరి చేస్తూ స్పై అవ్వాలనే ఆలోచనలో ఉన్న రిక్కీని … స్పైగా ..గాడ్ ని నాశనం చేయటానికి పంపుతాడు. ఆ మిషన్ లో రిక్కీ సక్సెస్ అయ్యాడా..అసలు స్పై అవ్వాలని రిక్కీ అలోచనల వెనక అసలు కథేంటి… డెవిల్ గాడ్ మధ్యలో ఎవరు గెలిచారు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

హాలీవుడ్ స్పై సినిమాలు చూసేవారికి ఈ సినిమా ఇబ్బందిగా ఉంటుంది.  కథలో లెక్కలు మించి ట్విస్టులు, టర్నులు ఉన్నాయి కానీ అవేమీ పండలేదు.కరుడుగట్టిన క్రిమినల్ డినోమారియో ని భారీ ఎలివేషన్ తో పరిచయం చేసి కథని మొదలుపెట్టిన దర్శకుడు అంతకంటే భారీ ఫైట్ తో రిక్కీని తెరపైకి తెస్తాడు. ఈ రెండు సీన్స్ తో ఇది విలన్, హీరోల కథని అక్కడే అర్ధమైపోతుంది.మధ్యలో కట్ చేసి.. ఫ్యామిలీ, ప్రేమ,ఆమెను హెరాస్ చేసినవాడికి వార్నింగ్ లు.. ఇలా ఒకొక్క సీన్ పేర్చుకుంటూ వెళ్లి మళ్ళీ విలన్, హీరో దగ్గరకి రావడానికి ఫస్ట్ హాఫ్ అంతా తీసుకున్నాడు దర్శకుడు. దీంతో ఈ ప్రయాణం రొటీన్ సాగదీత గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బాంగ్ కూడా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో వుంటుంది. సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలౌతుంది. దర్శకుడు తను అనుకున్న పాయింట్ ఇదే. ఇక హీరో  ఫ్లాష్ బ్యాక్,  స్పె అవ్వటానికి అతడు ఎంచుకున్న మార్గం అసలు కన్వీన్సింగ్ గా ఉండవు. మంచిస్పై థ్రిల్లర్ చక్కగా చూద్దామని కూర్చూంటే వేరేవి వస్తూంటాయి. మరో ప్రక్క ఇది చాలదన్నట్లు దిన్ని రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చూపించడానికే ప్రయత్నించాడు దర్శకుడు. నిజానికి ఈ పాయింట్ ని కన్ఫూజన్ లేకుండా ఇంజిలిజెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులని హోల్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాస్ గన్  ఫైట్స్ కే మొగ్గు చూపాడు.

పూనకం వచ్చినట్లు ఊగిపోతూ అఖిల్ భారీ గన్స్ పట్టుకుని కాలుస్తూంటే థియేటర్లో జనం కంగారుపడే పరిస్దితి ఏర్పడింది.  రెండు భారీ ఫైట్లతో ఈ కథకు ముగింపు పలికాడు.ఇక ఫస్టాఫ్  సాదాసీదాగా సాగుతుంది, లీడ్ పెయిర్ మధ్యలో వచ్చే సన్నివేశాలు, అఖిల్ కుటుంబం అలా ఏదో చూపించాడు కానీ ఎక్కడా ఎమోషన్ ఉండదు, పోనీ అలా అని కామెడీ కూడా లేదు. అఖిల్ ఫిజిక్ చూపించటంలోనే ఎక్కువ కాన్సర్టేట్ చేస్తన్నారా అనిపిస్తుంది. ఫస్టాఫ్ అయ్యాక మమ్ముట్టి హీరోయేమో అని అనిపిస్తుంది కూడా. అలాగే రెండో సగంలో డినో మోరియా కూడా అలానే అనిపిస్తాడు. అఖిల్ మాత్రం ఎక్కడా హీరోగా కనపడడు.  హీరోయిన్ లవ్ ట్రాక్ అయితే మరీ దారుణం..హీరోయిన్ చూస్తే హీరో లో ఆ  ఫీలింగ్స్ కలుగుతాయి. డైరెక్ట్ గా పిల్లల్నికందామని హీరో అడగడం, నాలుగు రోజులు కలసి తిరుగుదాం, నాకూ ఫీలింగ్స్ కలిగితే అప్పుడు చూద్దాం లే అని హీరోయిన్ చెప్పడం..అంతా ఏంటోగా ఉంటుంది.   ఏదైమైనా ఇంత హైప్ ఇచ్చిన ఈ సినిమాకి దానికి తగ్గట్టుగా లేదు అని అనిపిస్తుంది.

టెక్నికల్ గా :

దర్శకుడుగా సురేంద్ర రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దాంతో మిగతా డిపార్టమెంట్స్ కూడా మమ అనిపించేసాయి. ఉన్నంతలో కెమెరా వర్క్ బాగుంది. పాటలు ఓకే అనిపిస్తాయి. మొదటి పాట డ్యాన్స్ కి ప్రత్యేకం.   నేపధ్య సంగీతం యాక్షన్ ని ఎలివేట్ చేస్తూ సాగింది. ముమ్మట్టి తెలుగు డబ్బింగ్ బాగా కుదిరలేదు.

ఫెరఫార్మెన్స్ లు :

స్పై గా అఖిల్ ..కేవలం సిక్స్ ప్యాక్ ఉంటే చాలనుకున్నాడు. నటన ను వదిలేసాడు. అయితే  డ్యాన్సులు హుషారుగా చేశాడు. యాక్షన్ సీన్స్ కోసం కష్టపడ్డాడు. అయితే ఎమోషన్స్ సీన్స్ లో మాత్రం అసలు పట్టించుకోనట్లే అనిపిస్తుంది.  హీరోయిన్ హోమ్లీగా కనిపించింది. ఆమె నటన కూడా బావుంది.ముమ్మట్టీ ది బలమైన పాత్రే కానీ రొటీన్ గా ట్రీట్ చేశారు.  మురళీ శర్మ, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళీ, భరత్ రెడ్డి వంటి నటీనటులు పరిధిమేర కనిపించారు.

చూడచ్చా :

అఖిల్ వీరాభిమానులు అయితే తప్పించి మిగతావారికి అంతగా నచ్చదు

నటీనటులు :

అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, భరత్ రెడ్డి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు

సాంకేతికవర్గం :

కథ : వక్కంతం వంశీ
మాటలు : భార్గవ్ కార్తీక్
ఛాయాగ్రహణం : రసూల్ ఎల్లోర్
సంగీతం : హిప్ హాప్ తమిళ, భీమ్స్ (వైల్డ్ సాలా సాంగ్)
Runtime. 2 hours 36 minutes.
నిర్మాత : రామబ్రహ్మాం సుంకర
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సురేందర్ రెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2023