ఓటు చిత్రం రీమిక్స్ సాంగ్ విడుదల

Published On: September 5, 2023   |   Posted By:

ఓటు చిత్రం రీమిక్స్ సాంగ్ విడుదల

ఓటు చిత్రం నుండి ఎవర్ గ్రీన్ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ సిరిమల్లె పువ్వా ని లాంచ్ చేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

హృతిక్ శౌర్య, రవి, ఫ్లిక్ నైన్ స్టూడియోస్ ఓటు సినిమాలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సాంగ్ సిరిమల్లె పువ్వా రీమిక్స్ ని లాంచ్ చేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

హృతిక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఓటు. చాలా విలువైనది అనేది ట్యాగ్ లైన్. ఫ్లిక్ నైన్ స్టూడియోస్ నిర్మాణంలో రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తన్వీ నేగి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఓటు మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. లెజెండరీ దర్శకుడు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రం లోని సిరిమల్లె పువ్వా పాటని లాంచ్ చేశారు.

ఈ పాట కోసం పదహారేళ్ళ వయసు సినిమాలోని ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ మెలోడి సిరిమల్లె పువ్వా సాంగ్ ని రీమిక్స్ చేశారు. ఒరిజినల్ పాటలోని మాధుర్యాన్ని మరింతగా పెంచుతూ చాలా అద్భుతంగా ఈ పాటని రీమిక్స్ చేశారు సిద్ధార్థ్. పాపులర్ సింగర్ సునీత మెస్మరైజింగ్ గా ఆలపించిన ఈ పాటలో వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో హీరోయిన్ తన్వీ నేగి బ్యూటీఫుల్ గా కనిపించింది. విజువల్స్ ప్లజంట్ గా వున్నాయి.

ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అగస్త్య సంగీతం అందిస్తున్నారు. ఎస్ రాజశేఖర్ డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ ఎడిటర్. మోహన్ తాళ్లూరి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్.

తారాగణం :

హృతిక్ శౌర్య, తన్వినేగి

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం : రవి
బ్యానర్ : ఫ్లిక్ నైన్ స్టూడియోస్
నిర్మాణం: ఫ్లిక్ ఫిలిమ్స్
సంగీతం: అగస్త్య
డీవోపీ : ఎస్ రాజశేఖర్
ఎడిటర్ : ప్రసాద్