కర్ణన్‌ తమిళ్ మూవీ రివ్యూ

Published On: May 26, 2021   |   Posted By:
కర్ణన్‌ తమిళ్ మూవీ రివ్యూ
 
దడదడలాడెంచెన్: ‘కర్ణన్‌’రివ్యూ

Rating:3/5

సామాజిక నేపధ్యం ఉన్న సినిమాలు తమిళంలో ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. అందుకు కారణం ధనుష్ వంటి స్టార్స్ ఆ సినిమాల్లో చేయటానికి ఉత్సాహం చూపించటం అంటే అతిశయోక్తి కాదు. లేకపోతే డీ గ్లామర్ పాత్రను పోషిస్తూ ఇలాంటి ఓ వర్గ పోరాట సినిమా చేయటం ఆశ్చర్యమే కదా.  ‘పరియేరుం పెరుమాళ్‌’తో మంచి పేరు తెచ్చుకున్న డైరక్టర్ మారి సెల్వరాజ్ మరోసారి అలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకొని మళ్లీ హిట్టు కొట్టాడు. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా కొడియాంకులం అనే గ్రామంలో 1995లో జరిగిన కుల ఘర్షణ నేపథ్యంలో జరిగే ఈ కథ అక్కడ జనాలని బాగానే ఆకట్టుకుంది. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు తమిళనాడులో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది ఈరోజు అమెజాన్ ప్రైమ్ లో కూడా రిలీజ్ అయింది మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్:

తమిళనాడులోని ఓ మారుమూల దళిత గ్రామం. కనీస సౌకర్యాలు కూడా లేని రోజులు. బొగ్గు అమ్ముకుని బ్రతికే నిరుపేదలు. బస్సుకానీ, ఆ బస్సు నడవటానికి సరపడ రోడ్డు కానీ లేవు.  బస్సు ఎక్కాలంటే పక్క ఊరికి వెళ్లి అక్కడ బస్టాప్ లో ఎక్కాల్సిదే. ఈ దళిత గ్రామం మీదుగా బస్సు వెళ్తున్నా గానీ ఇక్కడ బస్సు ఆపరు . ఆ  గ్రామంలో కర్ణ(ధనుష్) తన కుటుంబంతో ఉంటాడు. ఆ ఊర్లో ఉన్న అందరూ కూడా చిన్న,చితక పనులు చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉంటారు.  కర్ణ ఊరి వాళ్లంతా తక్కువ కులం వాళ్ళు కావడంతో పక్క ఊర్లో ఉన్న ఎక్కువ కులం వాళ్లు ఈ ఊరిపై ఆదిపధ్యం చలాయిస్తూంటారు. ఎప్పుడూ అణిచివేయాలిని చూస్తూ ఉంటారు. ఇలా రోజులు నడుస్తూండగా ఒకరోజు ఓ గర్భిణీ స్త్రీ కోసం బస్ ఆపితే ..ఆగకుండా వెళ్తుంది.  అప్పుడు ఆ గర్భిణీ కొడుకు బస్ మీదకు రాయి విసురుతాడు. దాంతో బస్ ఆపి డ్రైవర్ అండ్ కండక్టర్ వచ్చి ఎవరు బస్ ఆపారు అంటూ కర్ణన్ ఊరి వాళ్ళను కొడతాడు. అప్పుడు కర్ణన్ వచ్చి ఆ బస్సు అద్దాలు పగలగొట్టి అందరినీ కొడతాడు దాంతో అది పెద్ద ఇష్యూ అయ్యి పోలీసులు ఊరి మీదకు వస్తారు.మీ ఊరొక శవాల దిబ్బ అని ఎగతాళి చేస్తూ హెచ్చరిస్తాడు కండక్టర్‌.  ఆ తర్వాత ఏం జరిగింది?? వాళ్ళ ఊరి సమస్య తీరిందా లేదా అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
 
కుల వ్యవస్థ మీద కులం పేరుతో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల మీద ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కర్ణన్ కూడా కుల వ్యవస్థ మీద వచ్చిన సినిమానే. దాదాపు 24 ఏళ్ల క్రితం తమిళనాడులోని ఒక గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు మారి సెల్వరాజ్ ఈ సినిమా తీశాడు. అయితే ఇలాంటి దారుణ సంఘటనలు జరిగాయి. కులం పేరుతో ఎంతో మందిని అన్యాయంగా చంపేశారు అని తెలిసినప్పుడు మనం అవి చదివి లేదా చూసి అయ్యో అనుకుని బాధ పడతాం. ఈ సినిమా చూసినప్పుడు కూడా తక్కువ కులం వాళ్ళు అయినందుకు ఆ ఊరి ప్రజలు ఇంత నరకం అనుభవించారు. ఏకంగా తమ జీవితాలనే కోల్పోయారు అన్నది చూసినప్పుడు గుండెలో కలుక్కుమంటుంది.తన ఊరి ప్రజల కష్టాలు వాళ్ళ జీవితాల గురించి అసలేం పట్టించుకోకుండా కర్ణన్ చాలా సాధారణ యువకుడి మాదిరే ఊర్లో తమ కుటుంబంతో ఉంటాడు . కానీ చివరకు అతని ఓపిక నశించి తమకు జరుగుతున్న అన్యాయాల మీద తిరగబడతాడు.  అలా తిరగబడితే ఊరికి ఏం చెడు జరుగుతుందో అని ఊరి జనం భయపడితే పోరాడితే పోయేదేమీ లేదు. ఈ బానిస బతుకులు తప్పా అని వాళ్లకు ధైర్యం నూరిపోసి పోలీసులతో యుద్ధానికి సిద్ధం చేస్తాడు.

ఆ తర్వాత అనుకోకుండా కర్ణన్ కు ఆర్మీలో జాబ్ రావడం జరుగుతుంది. దాంతో  ఊరి వాళ్ళు అంతా ఈరోజుకి అయినా మన ఊరి వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది వెళ్ళమని కర్ణన్ ను పంపిస్తారు.  అదే సమయంలో పోలీసులు వచ్చి ఊరి వాళ్ళను హింసిస్తూ ఉంటే లాల్ పాత్ర కిరోసిన్ పోసుకుని సజీవ దహనం చేసుకుంటాడు. ఆ విషయం తెలిసి కర్ణన్ తన ఊరికి తిరిగి వచ్చి పోలీసులతో ఫైట్ చేసి చివరకు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కత్తి తో గొంతు కోసి చంపేస్తాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి కర్ణన్ ఊరికి తిరిగి వస్తుంటే తమ ఊరి వాళ్ళ బ్రతుకులు మారాయి. ఇప్పుడు బస్ తమ ఊరి దగ్గర కూడా ఆగుతుంది అని తన అక్కయ్య రాసిన లెటర్ చదువుకోవడం చేస్తాడు.  ఊరికి రావడం, అక్కడ పోలీసుల దాడిలో మరణించిన ఊరి వాళ్లకు నివాళి అర్పించి ఇక దుఖం పక్కనపెట్టి డాన్స్ చేస్తూ ఉంటే సినిమా ఎండ్ అవుతుంది.

ఎవరెలా చేసారు..

తన పాత్రలో ధనుష్ దాదాపు జీవించాడు అనే చెప్పాలి. ముందు ఆవారగా తిరిగే కుర్రాడిగా ఆ తర్వాత ఊరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే యువకుడిగా తన నటన ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తాడు.ఇక లాల్ పాత్ర హీరో అక్క, ఊర్లో కర్ణన్  ప్రేమించే ద్రౌపది గా రజిష విజయన్ ,పోలీస్ ఆఫీసర్ గా చేసిన వ్యక్తి ఇలా సినిమాలో అందరూ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

టెక్నికల్ గా..

కెమెరా పనితనం బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.ఈ  సినిమాలో మరొక గొప్ప డిపార్ట్ మెంట్ సంగీతం సంతోష్ నారాయణ్ తన మ్యూజిక్ తో దాదాపు చాలా సీన్స్ ను మరొక లెవెల్ కు తీసుకు వెళ్లాడు  దర్శకుడు మారి సెల్వరాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అతను సినిమాలో ప్రతి పాత్రను ప్రతీ సీన్ ను ఎంత ప్రేమించి చేశాడు అన్నది మనకు తెరపై కనిపిస్తూనే ఉంటుంది. సినిమా చూసిన చాలా సేపటి వరకు కూడా సినిమాలో కొన్ని పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.

హైలైట్స్ :

ధనుష్ యాక్టింగ్
,సపోర్టింగ్ యాక్టర్స్

డైరెక్షన్,
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం

స్లో నేరేషన్

చూడచ్చా :

ధనుష్ యాక్టింగ్ కోసం, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడవచ్చు

ఎవరెవరు:

నటీనటులు :ధనుష్‌, రజీషా విజయన్‌, లాల్‌, యోగిబాబు తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫ్రీ: తెని ఈశ్వర్‌
దర్శకుడు : మారి సెల్వరాజ్
నిర్మాత : కలై పులి ఎస్ థాను
ఓటటీ :  అమెజాన్ ప్రైమ్
రిలీజ్ : మే 14, 2021
రన్ టైమ్ : 156 నిమిషాలు 
భాష: తమిళం