కీడా కోలా మూవీ బ్రహ్మానందం ఫస్ట్ విడుదల

Published On: February 1, 2023   |   Posted By:

కీడా కోలా మూవీ బ్రహ్మానందం ఫస్ట్ విడుదల

తరుణ్ భాస్కర్ దాస్యం, విజి సైన్మా కీడా కోలా లో నెవర్ బిఫోర్ అవతార్ లో కామెడీ కింగ్ బ్రహ్మానందం

తన మొదటి రెండు చిత్రాలతో వరుస విజయాలను అందించిన యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ కీడా కోలా ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ఎనిమిది ప్రధాన పాత్రలు ఉన్నాయి. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందంని నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. బ్రహ్మానందం గారిని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపించబోతున్నాం. ప్రతీ ఇంట్లో వుండే తాత పాత్రలో ఆయన కనిపిస్తారు. పేరు.. వరదరాజు. మిస్టర్ బి. మీకు ఖర్చులకి ఇచ్చేస్తాడు. అని ట్వీట్ చేశారు తరుణ్ భాస్కర్.

బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ లో బ్రహ్మానందం పజిల్ ఫేస్ ఆకట్టుకుంది. మీ ప్రపంచం వింతగా మారబోతోంది అని పోస్టర్ పై క్యాప్షన్ ఇచ్చారు.

కీడా కోలా ఈ ఏడాది విడుదల కాబోతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

సాంకేతికవర్గం :

రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్ దాస్యం
ప్రొడక్షన్ హౌస్ – విజి సైన్మా
రైటర్స్ రూమ్ – క్విక్ ఫాక్స్
నిర్మాతలు : కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్ & ఉపేంద్ర వర్మ
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
ఎడిటర్: ఉపేంద్ర వర్మ