క్రైమ్ రీల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

క్రైమ్ రీల్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను : నటుడు సముద్రఖని

అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రైమ్ రీల్. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం విశేషం.

ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సముద్రఖని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రైమ్ రీల్ సినిమా మంచి విజయం సాధించాలి, సంజన అన్నే దర్శకురాలిగా ప్రతిభ చూపించాలని, కొత్త కాన్సెప్ట్ తో రానున్న ఈ క్రైమ్ రీల్ అందరిని అలరించాలని కోరుకుంటున్నాను, ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి, సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు.

సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్న క్రైమ్ రీల్ చిత్రం జూన్ 14న విడుదలకు సిద్దంగా ఉంది. బాబు కొల్లాబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన అన్నే.

సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగింది, అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్ తో క్రైమ్ రీల్ సినిమాను డైరెక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. మా సినిమా ట్రైలర్ సముద్రఖని గారి చేతుల మీదుగా విడుదల అవ్వడం , ఆయన మా సినిమాను ఆశీర్వదించడం ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకురాలు సంజన అన్నే తెలిపారు.