గం..గం..గణేశా మూవీ ట్రైలర్ మే 20 విడుదల

ఈ నెల 20న హీరో ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ రిలీజ్

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ గం..గం..గణేశా. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం.

ఈ నెల 31న గం..గం..గణేశా సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు గం..గం..గణేశా సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మంచి క్రైమ్ కామెడీ మూవీగా..ప్రేక్షకులు ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉండబోతోంది.

నటీనటులు :

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.

టెక్నికల్ టీమ్ :

ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాడి
సంగీతం : చేతన్ భరద్వాజ్
బ్యానర్ : హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు : కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
రచన, దర్శకత్వం : ఉదయ్ శెట్టి