గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసిన సైంధవ్ మూవీ టీమ్

Published On: September 19, 2023   |   Posted By:

గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసిన సైంధవ్ మూవీ టీమ్

స్పెషల్ పోస్టర్ తో అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసిన విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సైంధవ్ టీమ్

విక్టరీ వెంకటేష్ 75వ మైల్ స్టోన్ మూవీ సైంధవ్. హిట్‌వర్స్ ఫేమ్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి భారీ కాన్వాస్‌పై అత్యున్నత స్థాయి నిర్మాణం, సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

గణేష్ చతుర్థి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్‌, బేబీ సారా.. సరదాగా ఫ్యామిలీ టైం ని గడుపుతూ అనందంగా కనిపించారు.

వెంకటేష్ 75వ మైల్ స్టోన్ మూవీగా రూపొందుతున్న సైంధవ్ని మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన సైంధవ్ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.

పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

తారాగణం :

వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణ్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: ఎస్.మణికందన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్