గామి మూవీ షోరీల్ ట్రైలర్ PCX ఫార్మాట్‌లో ఫిబ్రవరి 29 లాంచ్

Published On: February 27, 2024   |   Posted By:

గామి మూవీ షోరీల్ ట్రైలర్ PCX ఫార్మాట్‌లో ఫిబ్రవరి 29 లాంచ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గామి షోరీల్ ట్రైలర్ PCX ఫార్మాట్‌లో లాంచ్ చేసే మొట్టమొదటి ట్రైలర్, PCX స్క్రీన్ ప్రసాద్స్‌లో ఫిబ్రవరి 29న లాంచ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి గ్రాండియర్ కి తగ్గట్టు, అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి బిగ్ స్క్రీన్‌ను ఎంపిక చేశారు మేకర్స్. ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. PCX ఫార్మాట్‌లో లాంచ్ చేసే మొట్టమొదటి ట్రైలర్ ఇదే.

గామి అనేది ఒక వ్యక్తి తన భయాన్ని జయించటానికి అసాధ్యమైన, అడ్వంచరస్ జర్నీ. గ్రాండ్ స్కేల్ లో సినిమాని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి. టీజర్, పాటలు సినిమా ప్రధాన కోర్ థీమ్ ఆవిష్కరించగా, ట్రైలర్ హీరో అద్భుతమైన ప్రయాణాన్ని చూపించబోతోంది. ట్రైలర్ పోస్టర్‌లో విశ్వక్ సేన్‌తో పాటు అఘోరాలు వారి చేతుల్లో టార్చ్‌లు పట్టుకుని ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపిస్తున్నారు.

విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో వెరీ టాలెంటెడ్ చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. V సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది.

హారిక పెడదా, మహమ్మద్ సమద్ ఇతర ప్రముఖ తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.

గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం :

విశ్వక్ సేన్, చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: విద్యాధర్ కాగిత
నిర్మాత: కార్తీక్ శబరీష్
ఎడిటర్: రాఘవేంద్ర తిరున్
సంగీతం: నరేష్ కుమారన్
డీవోపీ: విశ్వనాథ్ రెడ్డి