గ్రంధాలయం మూవీ మూడవ పాట విడుదల

Published On: January 27, 2023   |   Posted By:

గ్రంధాలయం మూవీ మూడవ పాట విడుదల

హీరో శ్రీకాంత్‌ విడుదల చేసిన గ్రంధాలయం మూడవ పాట శ్రీకాంత్‌ చేతుల మీదుగా గ్రంధాలయం థర్డ్‌ సింగిల్‌

వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గ్రంథాలయం. ఈ చిత్రం శరవేగంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం టీజర్‌ను రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. లక్కీమీడియా నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ చిత్ర టీజన్‌ని విడుదలచేయగా, ఈ చిత్రంలోని మూడవ పాటను సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ చేతుల మీదగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ . గ్రంధాలయం గొప్ప విజయాన్ని సాధించాల ని ఆకాంక్షించారు. చిత్ర యూనిట్‌ సభ్యులందరికి ఆయన ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు దక్కించుకోవాలన్నారు.

గ్రంధాలయం కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా సాగుతుంది. గ్రంధాలయం నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం ఉంటుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు నిర్మాతలు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు :

విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా

సాంకేతిక వర్గం :

రచన దర్శకత్వం సాశివన్‌జంపాన
సినిమాటోగ్రఫీఃసామలభాస్కర్‌
సంగీతం : వర్ధన్‌
ఎడిటర్‌ : శేఖర్‌పసుపులేటి