ఘనంగా శివబాలాజీ పుట్టినరోజు వేడుకలు
 
కథకు ప్రాధాన్యమున్న సినిమాలలో నటించి అందరి ప్రశంసలను అందుకున్న నటుడు శివబాలాజీ. ఆ తరువాత సొంత బేనర్ ‘గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్’ ను స్థాపించి ‘స్నేహమేరా జీవితం’ చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఈ సంవత్సరం మా జాయింట్ సెక్రటరీ గా భాద్యతలు చేపట్టారు. అక్టోబర్14 న  శివబాలాజీ పుట్టినరోజును  తన సన్నిహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఘ‌నంగా  సెలబ్రేట్ చేసుకున్నారు.
 
ఈ సందర్భంగా …
 
శివబాలాజీ మాట్లాడుతూ  – “మా బేనర్ ‘గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్’ లో నిర్మించిన ‘స్నేహమేరజీవితం’ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా నాకు  మంచి పేరు వచ్చింది.  ఆ సినిమా విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో మంచి కథతో మా బేన‌ర్‌లో సెకండ్ మూవీని స్టార్ట్ చేస్తున్నాం.  త్వరలోనే షూటింగ్ మొద‌ల‌వుతుంది. అలాగే అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉండే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాను. మంచి కథ, కథనం ఉన్న సినిమాతోనే మీ ముందుకు రావాలని కొంచెం టైమ్ తీసుకోవడం జరిగింది. ఇకనుండి నటుడిగా, నిర్మాతగా ఇలా కంటిన్యూగా మీముందుకు రాబోతున్నాను. ఈ సంవత్సరం ‘మా’ అసోసియేషన్ లో జాయింట్ సెక్రటరీగా నేను ఎన్నికవ్వడం మంచి పనులు చేయడానికి  నాకొచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకెప్పుడూ ఉండాలి” అన్నారు.