జై హనుమాన్ మూవీ ప్రీప్రొడక్షన్ ప్రారంభం

Published On: January 23, 2024   |   Posted By:

జై హనుమాన్ మూవీ ప్రీప్రొడక్షన్‌ ప్రారంభం

అయోధ్య శ్రీరామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా పివిసియు నుండి మరో ఎపిక్ అడ్వెంచర్ జై హనుమాన్ ప్రీప్రొడక్షన్‌ను ప్రారంభించిన విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ చారిత్రాత్మక విజయం తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు.

ప్రీక్వెల్ ముగింపులో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకున్నారు. ఇది లార్జర్ దెన్ లైఫ్ కథతో భారీ కాన్వాస్, అగ్రశ్రేణి ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించబోతోంది.

ప్రీప్రొడక్షన్ ప్రారంభించడానికి ప్రశాంత్ వర్మ గొప్ప సందర్భాన్ని ఎంచుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున, ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో యాగంలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి సినిమా స్క్రిప్ట్‌ను హనుమంతుని విగ్రహం ముందు ఉంచారు. ప్రీప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం తమకు లభించదని వారు భావించారు.

రెండు పోస్టర్లను విడుదల చేశారు. ఒకటి ప్రశాంత్ వర్మ హనుమంతుని ముందు నిలబడి స్క్రిప్ట్‌ను పట్టుకున్నట్లు చూపిస్తే, మరొకటి సీక్వెల్ ప్రకటించిన హనుమాన్ నుండి చివరి సీక్వెన్స్‌ను చూపుతుంది.

ఈ మాగ్నమ్ ఓపస్ సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.