జోరుగా హుషారుగా షికారు పోదమ మూవీ హ్యాపీ జర్నీ సాంగ్ విడుదల

జోరుగా హుషారుగా షికారు పోదమ మూవీ నుంచి హ్యాపీ జర్నీ సాంగ్ రిలీజ్

సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ. స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి హ్యాపీ జర్నీ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ర్యాప్ మిక్స్ చేసిన ఈ పాట జీవితం అనే జర్నీ గురించి అందులో ప్రేమ, భావోద్వేగాల గురించి వివరిస్తుంది. పాట అహ్లాదంగా మనసుకు హత్తుకునేలా ఉంది. వెంగి రాసిన ఈ పాటను కార్తీక్ ఆలపించారు. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ లవ్, ఎమోషన్స్ కలయికలో ప్రేక్షకులను మెప్పించే సినిమాగా జోరుగా హుషారుగా షికారు పోదమను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ సహా మరిన్ని అప్‌డేట్స్‌ను అందిస్తాం అన్నారు.

నటీనటులు :

సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా

సాంకేతికవర్గం :

బ్యానర్స్ – స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్, ఎం.ఆర్.ప్రొడక్షన్స్
నిర్మాతలు – ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు
రచన, దర్శకత్వం – సుభాష్ చంద్ర
సిినిమాటోగ్రఫీ – సాయి సంతోష్
మ్యూజిక్ – నాగ వంశీ
ఎడిటర్ – అనీల్ కుమార్.పి