టాప్ గేర్ మూవీ ట్రైలర్ రిలీజ్

రవితేజ చేతుల మీదుగా ఆది సాయి కుమార్ టాప్ గేర్ మూవీ ట్రైలర్ రిలీజ్

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ హవా నడుస్తోంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు ఆది సాయి కుమార్. ఇదే బాటలో ఇప్పుడు టాప్ గేర్ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు.

డిసెంబర్ 30న ఈ టాప్ గేర్ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన యూనిట్ ఎప్పటికప్పుడు సరికొత్తగా అప్ డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆది సాయి కుమార్ యాక్షన్ మోడ్‌కి మాస్ మహారాజ్ రవితేజ తోడై తన సహకారం అందించారు. కొద్దిసేపటి క్రితం రవితేజ చేతుల మీదుగా టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

2 నిమిషాల 9 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ భరితంగా ఉంది. టాప్ గేర్ సినిమాలోని వైవిధ్యాన్ని తెలిపేలా ట్రైలర్ కట్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. ఈ వీడియోలో ఆది సాయి కుమార్ యాక్షన్ సీన్స్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అబ్బురపరుస్తున్నాయి. హీరో హీరోయిన్ మధ్య నడిచే లవ్, రొమాంటిక్ సన్నివేశాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రేమలో ట్విస్టులు, విలన్స్ అటాక్, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి. ఎవర్రా మీరు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అని హీరో ఆది సాయి కుమార్ చెప్పే డైలాగ్ సినిమాలో వైవిధ్యాన్ని బయటపెడుతోంది. ఈ కథ మొత్తం ట్యాక్సీ డ్రైవర్ అయిన ఆది సాయి కుమార్ చుట్టూ తిరుగుతూ ఆడియన్స్‌కి థ్రిల్ ఫీల్ తెప్పిస్తుందని టాప్ గేర్ ట్రైలర్ స్పష్టం చేసింది.

ఈ ట్రైలర్ విడుదల చేసిన రవితేజ వీడియో చాలా బాగా కట్ చేశారని అన్నారు. చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ టాప్ గేర్ సూపర్ సక్సెస్ సాధించడం పక్కా అని అన్నారు. గతంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి కూడా సినిమాలోని వైవిధ్యాన్ని మెచ్చుకోవడం ఈ టాప్ గేర్ పై బోలెడన్ని అంచనాలు క్రియేట్ చేసింది.

ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 30వ తేదీన విడుదల కానుంది.

నటీనటులు :

ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు

టెక్నీషియన్స్ :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.శశికాంత్
సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: రామాంజనేయులు
కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి
ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి
బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్
ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్