డిటెక్టివ్‌ సత్యభామ చిత్రం పాత్రికేయుల సమావేశం

ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈ నెల 31 న వస్తున్న సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’

సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 31న సుమారు 500 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్, టీజర్, పాటలను చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ విడుదల చేశారు.

డిటెక్టివ్‌ సత్యభామ చిత్రం లోని ట్రైలర్ ను నిర్మాత పోలెమోని శ్రీశైలం విడుదల చేశారు. అలాగే ఇందులోని మొదటి పాటను రాజ పోలెమోని విడుదల చేయగా, నటి సునీత పాండే రెండవ పాటను, సినీ పి.ఆర్.ఓ ఆర్.కె. చౌదరి మూడవ పాటను, నటి శివ జ్యోతి నాలుగవ పాటను, నటుడు మురళి ఐదవ పాటను విడుదల చేశారు.

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో_

చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ .. ప్రతి ఒక్కరూ నా సినిమా అనుకోని చాలా కష్టపడ్డారు.సోనీ అగర్వాల్ ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు.7 జి బృందావనం చేసినప్పటి ఫ్యాన్స్ ఇప్పడు వస్తున్న ఈ సినిమా విడుదల కోసం ఇంకా ఎదురు చూస్తుండం గొప్ప విషయం.. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని అంగులతో తీర్చి దిద్దాము. స్క్రీన్ మాక్స్ ప్రసాద్ గారు మా చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 31 న సుమారు 500 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.

చిత్ర దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ .. సంగీత దర్శకుడుగా వర్క్ చేసిన నాకు నేను చెప్పిన కథను నిర్మాత శ్రీశైలం పోలెమోని నమ్మి నాకీ అవకాశం ఇచ్చారు. ఇందులో నటించిన వారంతా నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేశారు. టెక్నిసిషన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు.ఎవ్వరు ఎక్సెప్ట్ చెయ్యని ట్విస్ట్స్,టర్న్స్ ఇందులో ఉంటాయి. ఇందులోని పాటలు చాలా బాగుంటాయి..సోనీ అగర్వాల్ యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటాయి.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ నెల 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుంది అన్నారు .

డి.ఓ.పి లక్కీ మాట్లాడుతూ .. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. స్క్రీన్ మాక్స్ ద్వారా ప్రసాద్ గారు విడుదల చేస్తున్నారు.మాకు దర్శక,నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేసినందున ఈ సినిమా త్వరగా షూట్ కంప్లీట్ అయ్యింది. యూత్ కు కావాల్సిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి.

నటి శివజ్యోతి మాట్లాడుతూ .. ఇది నా నాలుగవ సినిమా ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది. అందరం ఎంతో కష్టపడి చేశాము.ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించిన సునీత పాండే మాట్లాడుతూ .. కార్పొరేటర్ తరువాత వస్తున్న మూడవ చిత్రమిది. “డిటెక్టీవ్ సత్యభామ’ వంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

మాటల రచయిత సంతోష్ ఇంగాని మాట్లాడుతూ .. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

నటుడు మురళి మురళి మాట్లాడుతూ. . మా నిర్మాతకు థియేటర్స్ లోనే విడుదల చేయాలని పట్టుబట్టి ఈ నెల 31 న విడుదల చేశారు.అందరం ఎంతో మంచి మనసుపెట్టి నటించాము. ఈ నెల 31 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.

నటీ నటులు :
సోని అగర్వాల్‌, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు :
బ్యానర్‌ : సిన్మా ఎంటర్టైన్మెంట్‌
నిర్మాత : శ్రీశైలం పోలె మోని
సంగీతం`దర్శకత్వం: నవనీత్‌ చారి
కెమెరా&ఎడిటర్‌: లక్కీ ఏకరి
డైలాగ్‌ : సంతోష్ ఇంగాని