తెగింపు మూవీ రివ్యూ

Published On: January 12, 2023   |   Posted By:

తెగింపు మూవీ రివ్యూ

 

Image

అజిత్ ‘తెగింపు’మూవీ రివ్యూ

Emotional Engagement Emoji
👎

ఎన్నో ఏళ్లుగా అజిత్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. కెరీర్ ప్రారంభం రోజుల్లో డిఫరెంట్ కంటెంట్ తో ప్రయోగాత్మక సినిమాలు చేసే అజిత్..మాస్ హీరోగా అవతరించాక రొటీన్ కథలుతో ముందుకు వస్తున్నాడు. దాంతో విజయం ఆయనతో దోబూచులాడుతోంది.  గతేడాది వలిమై సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఈసారి అదే ఉత్సాహంతో ‘తెగింపు’ మూవీతో రెడీ అయిపోయాడు. నీర్కొండ పార్వయ్, వలిమై మూవీస్ తర్వాత డైరెక్టర్ హెచ్. వినోద్ తో అజిత్ మూడో సినిమా ఇది. యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో భారీ బడ్జెట్ తో బోనీకపూర్ ఈ సినిమాని నిర్మించారు. మరి యాక్షన్ ప్యాకడ్ ట్రైలర్ తో ఎక్సపెక్టేషన్స్ పెంచిన తెగింపు మూవీ అందుకు తగ్గట్లుగా ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం!

స్టోరీ లైన్
బ్యాంకును అడ్డం పెట్టుకుని వేల కోట్ల స్కామ్ చేసిన వైట్ కాలర్ క్రిమినల్‌ను ఓ వ్యక్తి ఎలా బయట పెట్టాడు? అనేది ‘తెగింపు’ స్టోరీలైన్.  వైజాగ్ లో ఉన్న యువర్ బ్యాంక్ అనే ప్రెవేట్ సెక్టార్ బ్యాంక్ లో RBI రూల్స్ కి మించి రూ. 500 కోట్ల డబ్బు ఎక్సట్రా ఉందని కొందరికి తెలుస్తుంది. వారు.. బ్యాంకుపై దాడిచేసి ఆ డబ్బు కొట్టేయాలని స్కెచ్ వేస్తారు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఆ బ్యాంకులో చొరబడి కాల్పులు జరుపుతూ జనాలను బెదిరించే ఆ డబ్బుని ఎత్తుకుపోదామనుకున్న  టైమ్ లో.. డార్క్ డెవిల్ అలియాస్ మైఖేల్(అజిత్) రూపంలో ఓ ట్విస్ట్ ఎదురౌతుంది. డార్క్ డెవిల్ …ఆల్రెడీ అదే బ్యాంకు డబ్బు దోచుకోవడానికి వచ్చాడు. ఆ  ముఠాకి ఎదురు తిరుగుతాడు. డార్క్ డెవిల్  ను చూసి వారు భయపడతారు. కాసేపటికి ఆ దొంగల బ్యాచ్ ని , కస్టమర్లను, స్టాఫ్ నూ అందరినీ హోస్టేజస్ గా మార్చి డార్క్ డెవిల్ ప్రభుత్వంతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఇంతకీ ఈ డార్క్ డెవిల్ అసలు ఎవరు? బ్యాంకులో ఎందుకు ఉన్నాడు? అతనికి ఏం కావాలి?  బ్యాంకు డబ్బు కొట్టేయడం వెనుక ఉద్దేశం ఏంటి? లిమిట్ దాటి బ్యాంకులో డబ్బు ఎందుకు ఉంచారు? దానికోసం మైఖేల్ చేసిన పోరాటం ఏంటి? చివరికి ఏం సందేశం ఇచ్చాడు? అనేది తెరపై చూడాల్సిందే.

స్క్రిప్టు ఎనాలసిస్ …

ఈ సినిమా చూస్తూంటే మనకు ఈ మద్యకాలంలో వచ్చిన సర్కారు వారి పాట చిత్రం గుర్తుకు వస్తుంది. బ్యాంకులు ప్రజల నుండి డిపాజిట్స్ సేకరించి చేతులెత్తయడం.. ఆ సమయంలో జనాలు పడే కష్టాలను ఎమోషన్స్ తో  ప్రెజెంట్ చేయగలిగాడు దర్శకుడు. అలాగే పబ్లిక్ ఫండ్స్ ను ప్రభుత్వం ఎలా మిస్ యూస్ చేస్తుంది అనే కాన్సెప్ట్ చుట్టూ నడిపారు . ఇదేమీ గొప్ప స్టోరీ లైన్ కాదు.. రోజూ మీడియాలో చూసేదే. కానీ దానికి  కమర్షియల్ ఎలిమెంట్స్, మెసేజ్ జోడించి,అజిత్ ఇమేజ్ ని అడ్డంపెట్టి ఒడ్డున పడదామనేది డైరక్టర్ స్కెచ్.    హీరో అజిత్ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ అనిపించేలా రాసుకున్నారు. అలాగే అతని స్టైల్, యాక్షన్ సీక్వెన్స్ బాగానే డిజైన్ చేసారు.  అయితే.. అజిత్ ని ఇంటర్నేషనల్ గ్యాంగస్టర్ గా పరిచయం చేయటం…అతని ద్వారా జనాలకు మెసేజ్ ఇవ్వడం అనేది పెద్దగా ఆసక్తికలిగించని అంశం. అలాగే ఇలాంటి కథను కొత్త తరహా స్క్రీన్ ప్లే లో చెప్పగలిగాలి. రొటీన్  నేరేషన్ తో ఈ స్టోరీని చెప్పే ప్రయత్నం చేసారు. దానికి తోడు ట్విస్ట్ అనుకున్న ఎలిమెంట్స్ కొన్ని కన్ఫూజన్ కు దారి తీసాయి. చాలావరకు సీన్స్ అసలు కథలో ఏమవుతుంది అని ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ వచ్చేలాగా చేస్తాయి. హై మూమెంట్స్ లేకపోవడం ఒకటి ఇబ్బందిగా అనిపిస్తుంది.ఉన్నంతలో సెకండాఫ్ లో అజిత్ కు గూండా గ్యాంగ్ కు మధ్య వచ్చే ఫన్ సీన్స్ బాగా పండాయి.  క్రైమ్ రిపోర్టర్స్, పోలీసుల ఇన్వాల్వ్ మెంట్ బాగా చూపించారు.ఏదైమైనా స్క్రీన్ ప్లే పరంగా ఇది బోరింగ్ ఎటెమ్ట్.’తెగింపు’ ఫస్టాఫ్‌లో  ఒక్కో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళడంతో ఏదో జరగబోతుందని ఓ క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తూ వెళ్లారు. కానీ అధి చివరి దాకా సస్టైన్ చేయలేకపోయారు. ఇక సెకండాఫ్ స్టార్టింగులో  సాంగ్,  తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ రెగ్యులర్ ఫార్మటులో ఉండి విసిగిస్తాయి.    క్లైమాక్స్‌లో అయితే వాళ్ళకు ఏది తోస్తే అధి చేసేసారు. మినిమం లాజిక్స్ పక్కన పడేసి తెరపై రెచ్చిపోయారు.

టెక్నికల్ గా చూస్తే…

జిబ్రాన్ అందించిన సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. మరో సారి వినాలనిపించే  పాటలు కూడా ఏమీ లేవు. సినిమాటోగ్రాఫర్ మాత్రం ఈ సినిమాకి అదిరిపోయే బ్రైట్ విజువల్స్ ను అందించారు. ఎడిటర్ కాస్త శ్రద్ద లాగ్ లు లాగేసి రన్ టైం కొంచెం తగ్గించి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే అనిపిస్తుంది.

నటీనటుల్లో …
అజిత్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ కావటంతో అవే హైలెట్ అయ్యాయి.  అజిత్ డ్యాన్సులు, ఫైట్లు బాగున్నాయి.   మరో ప్రధాన పాత్రలో కనిపించిన మంజూ వారియర్ స్క్రీన్ స్పేస్ చెప్పుకునేంత అలేదు. అయితే… లక్ ఏమిటంటే…ఆమెతో పాటలు, రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేయలేదు.   ఫైట్ సీక్వెన్సులో బాగా చేసింది. సముద్రఖని, అజయ్, జాన్ కొక్కెన్ వంటి నటులు ఓకే.

చూడచ్చా?

అజిత్ అభిమానులు  డ్యాన్సులు, ఫైట్లు చూసి ఆనందపడటం తప్పించి చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు.నటీనటులు : అజిత్ కుమార్, మంజూ వారియర్, సముద్రఖని, పావని రెడ్డి, జాన్ కొక్కెన్, అజయ్, ప్రేమ్ కుమార్, భగవతి పెరుమాళ్ త‌దిత‌రులు

ఛాయాగ్రహణం : నీరవ్ షా
సంగీతం : జిబ్రాన్
నిర్మాత : బోనీ కపూర్, జీ స్టూడియోస్
రచన, దర్శకత్వం : హెచ్. వినోద్
Run Time:2h 26m

విడుదల తేదీ: జనవరి 11, 2022