తొలి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టిన కృష్ణమ్మ చిత్రం

హీరో సత్యదేవ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌తో తొలి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టిన ‘కృష్ణమ్మ’

వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున‌ విడుదల చేశాయి.  సత్యదేవ్‌లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన చిత్రంగా కృష్ణమ్మ మనన్నలు అందుకుంటోంది. సినిమాలో సత్యదేవ్ రగ్డ్ లుక్, రస్టిక్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి.

సత్యదేవ్ సినీ కెరీర్లో ‘కృష్ణమ్మ’ సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి రోజునే 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సినిమా రాబట్టుకుంది. ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ నేపథ్యంలో విడుదలైన ‘కృష్ణమ్మ’కు మంచి కలెక్షన్స్ రాబట్టుకోవటం మంచి పరిణామం. సత్యదేవ్ కెరీర్ లో బెస్ట్ మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే.

‘కృష్ణమ్మ’ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుంచే కాదు, అటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. మంచి మౌత్ వచ్చింది. దీంతో సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంది. మే నెలాఖరు వరకు పెద్దగా రిలీజెస్ లేనందు వల్ల కృష్ణమ్మ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధిస్తుందనటంలో సందేహం లేదు. ప్రేక్షకులను చక్కటి యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటూ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది కృష్ణమ్మ.

‘కృష్ణమ్మ’ సినిమాలో స్నేహం, ప్రేమ వంటి అంశాలతో మిళితమైన  యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తున్నాయి. సత్యదేవ్ తో పాటు లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, అతీరా రాజ్ కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు.