దరువెయ్ మూవీ టీజర్ రిలీజ్

Published On: February 16, 2023   |   Posted By:

దరువెయ్ మూవీ టీజర్ రిలీజ్

సుప్రీం సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా వెయ్ దరువెయ్ టీజర్ రిలీజ్

సుప్రీం సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని సాయి అన్న కి మరియు డైరెక్టర్ , ప్రొడ్యూసర్ గారికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ చెప్తున్నాను.

హీరో సాయి రామ్ శంకర్ గారు మాట్లాడుతూ సుప్రీం సాయిధరమ్ తేజ్ గారి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది మా సినిమా నుంచి ఇది వరకే రెండు సాంగ్స్ రిలీజ్ అయినవి వాటికీ చాల మంచి విశేష స్పందన వచ్చింది యూట్యూబ్ లో ట్రెండ్ అయినవి మరియు కోటి కి పైగా వ్యూస్ రావటం చాల ఆనందం గా ఉంది. పాటలు ఎలా అయితే నచ్చిందో ఈ సినిమా టీజర్ అంతకు మించి ఉంది . సినిమా చాల బాగా వచ్చింది. మీకు తప్పకుండ నచ్చుతుంది అని మరొక సారి మా ప్రొడ్యూసర్ గారికి , ఈ టీజర్ రిలీజ్ చేసిన సుప్రీం సాయిధరమ్ తేజ్ గారు థాంక్స్ చెప్తూకుంటున్నాను

దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ టీజర్ విడుదల చేసిన సాయిధరమ్ తేజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదలు , మా సాంగ్స్ ని మంచి రీచ్ చేసిన తెలుగు ప్రేక్షకులకి నా శతకోటి నమస్కారాలు, టీజర్ కూడా బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. మా హీరో సాయి గారు , ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాను అనే అనుకుంటున్నాను అని అన్నారు. నా నా మీద నమ్మకం తో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కూడా థాంక్స్ చెప్తున్నాను.

ప్రొడ్యూసర్ దేవరాజ్ గారు మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ గారి చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అయినందుకు ఆనందం గా ఉంది. మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది సినిమా , హీరో గారి కెరీర్ లో మరొక మంచి సినిమా అవుతుంది అని మేమంతా గట్టిగా నమ్ముతున్నాం అని అన్నారు ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని మార్చ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము.

నటీనటులు :

హీరో సాయి రామ్ శంకర్ , హీరోయిన్ యాశ శివ కుమార్ , సునీల్ , కాశి విశ్వనాథ్ , పోసాని కృష్ణ మురళి , పృథ్వి , తదితరులు నటిస్తున్నారు .

సాంకేతికవర్గం :

డైరెక్టర్ : నవీన్ రెడ్డి ,
ప్రొడ్యూసర్ : దేవరాజు పొత్తూరు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
కెమెరా మెన్ : ముత్యాల సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :జనగాని కార్తీక్ , శ్రీపాల్ చొల్లేటి,