దర్శకుడు బెజోయ్ నంబియార్ ఇంటర్వ్యూ

Published On: September 15, 2023   |   Posted By:

దర్శకుడు బెజోయ్‌ నంబియార్‌ ఇంటర్వ్యూ

నలుగురు దర్శకులతో కాలా సిరీస్‌ కొత్త ప్రయోగం : దర్శకుడు బెజోయ్‌ నంబియార్‌

తెల్లధనాన్ని నల్లగా మార్చే కథాంశంతో రూపొందిన కాలా వెబ్‌సిరీస్‌ డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ప్రముఖ నటీనటులు నటించిన ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కాలాలో నివేత పేరురాజ్, రిత్విక్ ముఖర్జే తో పాటు నలుగురు దర్శకులుకూడా నటించడం విశేషం. ఇది కొత్త ప్రక్రియ అని, కొత్త కదలకు కాలా స్ఫూర్తి అని హాట్‌స్టార్ ప్రతినిధులు తెలియయజేస్తున్నారు.

వీరి గురించి దర్శకుడు బెజోయ్‌ నంబియార్‌ మాట్లాడుతూ, డానిష్‌ అస్లాం, క్యూ అని పిలవబడే కౌషిక్‌ ముఖర్జీ, వినీల్‌ మాథ్యూ, శివ ఆనంద్‌ వీరంతా దర్శకులే. ఇది కావాలని తీసుకున్న నిర్ణయం కాదు. కాస్టింగ్‌ చేస్తున్నప్పుడు నా మనస్సులోకి వచ్చిన పేర్లు ఇవి. వీరిని ఉద్దేశ్యపూర్వకంగా తీసుకున్నారా! అని హాట్‌ స్టార్‌ బృందం అడిగింది. వారు మాత్రమే పాత్రలకు న్యాయం చేస్తారని భావించాను. సిరీస్‌కు కొత్తదనం వస్తుందని ఆలోచించానని అనగానే వారు అంగీకరించారు. సెట్‌లో నలుగురు దర్శకులుంటే స్క్రిప్ట్‌ మరింత మెరుగ్గా వస్తుందన్న పాయింట్‌ నచ్చి స్టార్‌ బృందం అభినందించారు. నేను క్రియేట్‌ చేసి రన్‌ చేస్తున్న షో ఇది. దాన్ని బేస్‌ చేసుకుని కొన్ని సీరిస్‌కూడా రావచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 15నుంచి డిస్నీలో ప్రసారం కానున్న కాలా మిస్టరీకి ఆదరణ మరింత పెరుగుతుంది అని చెప్పారు.