ది వేకెంట్ హౌస్ మూవీ విడుదలకు సిద్దం

Published On: September 14, 2023   |   Posted By:

ది వేకెంట్ హౌస్ మూవీ విడుదలకు సిద్దం

ఎస్తర్ నోరోన్హా నటించిన పాన్ ఇండియా చిత్రం ది వేకెంట్ హౌస్ విడుదలకు రంగం సిద్దం

జానెట్ నోరోన్హా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నటీ, గాయకురాలు ఎస్తర్ నోరోన్హా నటించిన తాజా చిత్రం ది వేకెంట్ హౌస్. ఎస్తర్ తల్లి జానెట్ నోరోన్హా నిర్మించిన ఈ చిత్రానికి మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ ఎస్తర్ రచనాదర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించారు. అయితే ఈ సినిమాతో తాను దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ది వేకెంట్ హౌస్ చిత్రాన్ని కన్నడ, గోవా కొంకణి భాషాల్లో రూపోందించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఆద్యాంతం ప్రేక్షకలను అలరించే సబ్జెక్ట్ ఉండడంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ భాషాల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని సంకల్పించారు.

తేజ డైరెక్షన్ లో వచ్చిన 1000 అబద్దాలు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఎస్తర్ తరువాత భీమవరం బుల్లోడు, 69 సంస్కార్ కాలనీ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తులు భాషాలో 2019లో వచ్చిన ఒరిజినల్ కాంతార సినిమాలో నటించి అక్కడ మంచి పేరును సంపాదించుకున్నారు. ఇప్పటికే నటీగా, గాయకురాలిగా పరిచయం ఉన్న ఎస్తర్ తన కలల ప్రాజెక్ట్ ది వేకెంట్ హౌస్ చిత్రంతో కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు, సాహిత్యం, పాటలు, నేపథ్య స్కోర్‌ తో పాటు దర్శకత్వం కూడా చేశారు.

జానెట్ నొరోన్హా ప్రొడక్షన్స్ ఇంతకుముందు సోఫియా ఏ డ్రీమ్ గర్ల్ అనే కొంకణి మూవీని నిర్మించింది – ఈ చిత్రంతో ఎస్తర్ నోరోన్హా 2018 కర్ణాటక రాష్ట్ర అవార్డును గెలుచుకుంది. మల్టీ ట్యాలెంటెడ్ ఎస్తర్ మాస్, గ్లామర్, డీ గ్లామర్ ఇలా ఎలాంటి పాత్రలు చేయడానికైనా సాహసిస్తుంది. తన ప్రతిభాతో సొంత బ్యానెర్ లో నిర్మించి, తెరకెక్కించిన ది వేకెంట్ హౌస్ చిత్రం త్వరలోనే థియేటర్లో విడుదల చేయడానికి రంగం సిద్దం అయింది.

నటీనటులు :

ఎస్తర్ నోరోన్హా ప్రాధాన పాత్ర

సాంకేతికవర్గం :

నిర్మాత: జానెట్ నోరోన్హా
రచయినా-దర్శకత్వం: ఎస్తర్ నోరోన్హా
సంగీత: ఎస్తర్ నోరోన్హా
సినిమాటోగ్రాఫర్: నరేందర్ గౌడ్
ఎడిటర్: విజయ్ రాజ్
డీఐ: అవతార్ మీడియాస్