దేవకీ నందన వాసుదేవ నుంచి జై బోలో కృష్ణ పాట విడుదల

అశోక్ గల్లా డ్యాన్స్ కూల్ అండ్ ఎలిగెంట్ గా వుంది. విజువల్స్ వైబ్రెంట్, గ్రాండ్ గా వున్నాయి. ఇది సినిమా ఆల్బమ్‌లోని మరో చార్ట్‌బస్టర్ సాంగ్ కానుంది.

గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పిరిచువల్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్అందించగా, హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

రసూల్ ఎల్లోర్‌తో పాటు ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో చాలా గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

నటీనటులు :

అశోక్ గల్లా, వారణాసి మానస

సాంకేతిక సిబ్బంది :

దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు