దోచుకున్నవాళ్ళకి దోచుకున్నంత చిత్రం జులై విడుదల

వావ్ సినిమాస్ పతాకంపై అంకుర్ వెంచుర్కర్, ప్రిన్స్ మహాజన్, సాగర్ కుద్వార్, ఆకాంక్ష వర్మ, శృతిక గోకర్, దితి ప్రియా మరియు సీజల్ మండవ హీరో హీరోయిన్స్ గా ఎస్. శివ దర్శకత్వం లో అనిల్ నిర్మిస్తున్న చిత్రం “దోచుకున్నవాళ్ళకి దోచుకున్నంత”. యువతను ఉర్రూతలూగించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై ఒకటి న విడుదలకు సన్నాహాలు చేస్తుంది.

చిత్ర వివరాలు తెలియజేస్తూ నిర్మాత అనిల్ మాట్లాడుతూ “మా వావ్ సినిమాస్ బ్యానర్ పై వస్తున్న మొదటి చిత్రం ఇది. కథ చాలా కొత్తగా ఉంటుంది, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రతి సీను రంజింప చేస్తుంది. మా చిత్రం లో నాలుగు హీరోయిన్స్ ఉన్నారు, యువతకి కన్నుల పండుగగా ఉంటుంది. ఇది ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, నేటి సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల ఆధారంగా తీసిన కథ ఇది. వినోదంతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. “దోచుకున్నవాళ్ళకి దోచుకున్నంత” చిత్రం జులై ఒకటో తారీఖున విడుదల అవుతుంది. మా చిత్రాన్ని అందరూ చూడాలి” అని తెలిపారు.

సినిమా పేరు : దోచుకున్నవాళ్ళకి దోచుకున్నంత

నటి నటులు : అంకుర్ వెంచుర్కర్, ప్రిన్స్ మహాజన్, సాగర్ కుద్వార్, ఆకాంక్ష వర్మ, శృతిక గోకర్, దితి ప్రియా, సీజల్ మండవ మరియు తదితరులు

కెమెరా : జగదీష్

ఎడిటర్ : శివ శర్వాని

డైలాగ్స్ : జి రవి కుమార్

సంగీతం : జయ సూర్య

ప్రొడ్యూసర్ : అనిల్

డైరెక్టర్ : ఎస్. శివ