ధమాకా మూవీ రివ్యూ

Published On: December 23, 2022   |   Posted By:

ధమాకా మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

రవితేజ గత కొంతకాలంగా ఎందుకనో బాగా రొటీన్ పాయింట్స్ కూడిన పాత కథలనే చేస్తున్నారు అవి సరైన ఫలితాన్ని ఇవ్వటం లేదు అయినా రూట్ మార్చటం లేదు. ఈ సంవత్సరం రవితేజ నటించిన రెండు సినిమాలు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ విడదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. తాజాగా ధమాకా అంటూ ద్విపాత్రాభినయం కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా రౌడీ అల్లుడు కు ఓ వెర్షన్ లాంటిదని దర్శక,రచయితలు రిలీజ్ కు ముందే ప్రకటించి మరీ రిలీజ్ చేసారు మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో రివ్యూలో చూద్దాం.

కథాంశం

పీపుల్ మార్ట్ అధినేత చక్రవర్తి (సచిన్ ఖేడేకర్) కుమారుడు ఆనంద చక్రవర్తి (రవితేజ), మిడిల్ క్లాస్ మ్యాన్ స్వామి (రవితేజ) ఒకే పోలిక. అచ్చు గుద్దినట్లు ఒఖే రకంగా ఉంటారు. స్వామి పావనిని (శ్రీలీల)ను ఇష్టపడతాడు అయితే ఆమె తండ్రి (రావు రమేశ్) ఆమెను కోటీశ్వరుడైన ఆనంద్ చక్రవర్తికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. మరో ప్రక్క కార్పొరేట్ సంస్థ అధినేత జెపి (జయరాం) ఓ డిఫరెంట్ క్యారక్టర్. అతను కన్ను పడ్డ సంస్థను నయానో, భయానో స్వాధీనం చేసుకుంటూ వస్తుంటాడు ప్రస్తుతం అతని కన్ను పీపుల్ మార్ట్‌ పై పడింది. అతను ఆ సంస్దను ఆక్రమించుకోవటానికి పావులు కదుపుతూంటాడు మరో పక్క పావని (శ్రీలీల) ఒకే పోలికలు ఉన్న ఆనంద్, స్వామిలో ఎవరిని ఇష్టపడుతుంది జయరాంని ఎవురు ఎదుర్కొంటారు? చివరకు ఏమైంది అనేది ధమాకా కథాంశం.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్

ఎప్పుడు కొత్త పాయింట్స్ అంటే ఎక్కడనుంచి వస్తాయి పాత వాటినే రీసైకిల్ చేయాలి అని చాలా మంది నమ్ముతూంటారు. వర్కవుట్ అయ్యినంతవరకూ ఏ సమస్యా లేదు. అయితే ఈ ఓటిటి జనరేషన్ ని ఆకట్టుకోవాలంటే పాత,కొత్త కాదు ఇంట్రస్టింగ్ గా చెప్పాలి డైరక్టర్ అది కొంతవరకూ నమ్మినట్లున్నారు. రవితేజ అభిమానులు ఏవైతే ఇష్టపడతారో ఆ ఎలిమెంట్స్ కలిసే స్టోరీ లైన్ ని ఎంచుకున్నాడు కాస్త కన్ఫూజన్ కామెడీ మరింత యాక్షన్ కామెడీ చాలా వరకూ రొట్ట కామెడీ కలిపేసి ఈ కామెడీ ఎంటర్టైనర్ ని మన ముందు పెట్టాడు. అయితే ఈ కథ రొటీన్ అని కూడా అనకూడదు అంతకు మించిన పదం వాడాలి తెలుగు తెర‌పై ఏళ్ల తరడి విసుగు,విరామం లేకుండా చూస్తున్న క‌థే. అయితే ఇప్పటికాలానికి తగినట్లుగా కార్పొరేట్ నేప‌థ్యం తీసుకొచ్చి, కొత్త పాయింట్ అనే లుక్ ఇచ్చే ప్రయత్నం చేసారు. అలాగే హీరోని రెండు పాత్ర‌ల్లో ప‌రిచ‌యం చేయ‌డం కార్పొరేట్ దుర్మార్గాలతో సినిమా మొద‌లెట్టి ముందుకు వెళ్లారు. అలాగని విలన్ పాత్రను బలంగా చేయలేదు. బాగా బల్ గా సాగుతుంది అయితే ఈ క్రమంలో హీరోయిన్ ని రౌడీగ్యాంగ్ ఏడిపించ‌డం అక్కడికి హీరో వ‌చ్చి ఆ గ్యాంగ్ కువార్నింగ్ ఇవ్వటం ఆ త‌ర్వాత ఫైట్‌, పాట‌ ఇలా లాక్కెళ్లిపోయారు. ఎక్కడా కొద్దిపాటి ఇంటెన్సిటీ కానీ, స్క్రీన్ ప్లే ఆసక్తిగానీ కనిపించవు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఉన్నంతలో బాగుంది మళ్లీ సెకండాఫ్ పరమ రొటిన్ గా సాగింది. ఓవరాల్ అక్కడక్కడా నవ్వించి ఓకే అని బలవతంగా అనిపించేసారు. స్క్రిప్టు సమస్య అనటానికి లేదు ఎందుకంటే అసలు స్టోరీలైన్ లోనే సమస్య ఉన్నప్పుడు విస్తరణ గురించి మాట్లాడేది ఏముంది.

టెక్నికల్ గా

స్క్రిప్టు పరంగా మార్కులు వేయించుకోలేకపోయిన ఈ చిత్రం టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ లోనే ఉంది. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా ఆకర్షణగానే నిలిచాయి. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ కాస్త చెక్కాల్సింది.

నటీనటుల్లో

రవితేజ పెద్ద వయస్సు ఇట్టే కనపడిపోతోంది. అయితే ఆయన సీనియారిటీ మాత్రం నటనలో కనిపిస్తుంది. రెండు పాత్రలలో వేరియేషన్ ను రవితేజ కూడా చక్కగా ప్రదర్శించాడు. ఇక హీరోయిన్ శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు గ్లామర్‌ ప్రదర్శన చేసింది పాటల్లో దుమ్ము రేపింది. రావు రమేష్, తణికెళ్ల, సచిన్ కేడేఖర్,హైపర్ ఆది, అలీ వంటి వారు నుంచి ఏది ఆశిస్తామో అది ఇచ్చేసారు.

ప్లస్ లు

రావు రమేశ్ – హైపర్ ఆది మధ్య కామెడీ ట్రాక్
రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్
ఉషారైన పాటలు
ఇంటర్వెల్ ట్విస్ట్

మైనస్ లు

రొటీన్ కథ, స్క్రీన్ ప్లే
పస లేని క్లైమాక్స్
ప్రెడిక్టబులిటి

చూడచ్చా

కామెడీని ఇష్టపడేవాళ్లు అక్కడక్కడా పండే ఫన్ ఎపిసోడ్స్ కోసం వెళ్లచ్చు

నటీనటులు :

రవితేజ, శ్రీలీల, జయరాం, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, హైపర్ ఆది తదితరులు

సాంకేతికవర్గం :

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే : ప్రసన్న కుమార్ బెజవాడ
కూర్పు : ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
సంగీతం : భీమ్స్ సెసిరోలియో
నిర్మాతలు : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
రన్ టైమ్: 138 మినిట్స్
విడుదల తేదీ: డిసెంబర్ 23, 2022