నచ్చింది గాళ్ ఫ్రెండూ మూవీ రివ్యూ

ఫలానా హీరో,హీరోయిన్ ఉంటేనే సినిమా చూస్తామనే పరిస్దితి మారింది. ఎవరు కొత్తగా కథ చెప్పి, ఇంట్రస్టింగ్ గా అనిపించేలా చేసినా ఆ సినిమాని మోస్తున్నారు జనం. అయితే వాళ్లు ఎంకరేజ్ చేస్తున్నా బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు అయితే రావటం లేదు. ఆ సినిమాలు మరుసటి శుక్రవారం చూడటం లేదు. ఈ క్రమంలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘నచ్చింది Girl Frienడూ’ . ఈ సినిమా కథ ఏమిటి..నిలబడే కథేనా, ఈ టైటిల్ పెట్టడం వెనక విషయం ఏమిటి..క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా మనకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
స్టాక్ మార్కెట్ లో జాబ్ ట్రైల్స్ లో ఉంటాడు రాజారాం (ఉదయ్ శంకర్) . పెళ్ళిళ్ళ పేరయ్య వద్ద శాండీ అనే అమ్మాయి ఫోటో చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమె ఫొటో పట్టుకుని ఇంటర్వూకు వెళ్తూండగా ఆమే కనపడుతుంది. సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ అనలిస్ట్ సంధ్య అలియాస్ శాండీ (జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్)పనిచేస్తూంటుంది
ఎలా ఉందంటే
ఇది సగమే ఉడికిన వంటకంలాంటి స్క్రిప్టుతో చేసిన సినిమా. డైరక్టర్ ఏదో చెప్దామని మొదలెట్టి..దాన్ని ఎలా చెప్పాలో తెలియక చివరి దాకా లాగి,లాస్ట్ లో తను చెప్పాలనుకుంటున్న విషయం ఇది అని తేల్చేసాడు. అందుకోసం స్టాట్ మార్కెట్, లవ్ స్టోరీ, మర్డర్స్ వంటి రకరకాల థ్రెడ్ లు అల్లాడు. అయితే ఏ థ్రెడ్ ఎలా ఉన్నా..ఇంట్రస్టింగ్ నేరేషన్ తో సాగితే సమస్య రాదు. కానీ ఇక్కడ అది జరగలేదు.ముఖ్యంగా ఇలాంటి కథలకు అవసరమైన స్క్రీన్ ప్లే కూడా ఇంప్రెస్ చేసే రేంజ్ లో లేదు. ఫస్టాఫ్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉన్నా, సెకండాఫ్ ఉన్నంతలో ఇంట్రస్టింగ్ గానే సాగింది. అయితే సినిమాలో ఎంగేజింగ్ గా అనిపించే సీన్స్ లేవు. చాలావరకూ సాగదీతగా ఉన్నట్టు అనిపిస్తాయి. సినిమాకు కీలకం అనుకున్న లవ్ ట్రాక్ కూడా ఏమంత గొప్పగా మెస్మరైజ్ చేసేలా కూడా ఉండదు. డైరక్టర్ …ఇది థ్రిల్లర్ కథ కదా అనుకుని వాటిని ప్రక్కన పెట్టేసినట్లున్నాడు. దాంతో లవ్ సీన్స్ అన్నీ బోరింగ్ గా అనిపిస్తాయి. ఈ సినిమాలో ఏకైన ఎలిమెంట్ స్టాక్ మార్కెట్ . స్టాక్ మార్కెట్ గురించి చాలా మందికి తెలీని అంశాలు తెలిపేలా చేసారు. స్టాక్ మార్కెట్ బిజినెస్ లోని లొసుగులు మధ్యతరగతి ఫ్యామిలీ లు ఎదుర్కొనే సమస్యలను డీసెంట్ గా చూపించిన విధానం మాత్రం డైరక్టర్ బాగా డీల్ చేసారు.
టెక్నికల్ ఫెరఫార్మెన్స్
ఓ చిన్న సినిమాకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అయితే దొరికింది. డైరక్షన్ జస్ట్ ఓకే అన్నట్లంది. మిగతా టెక్నీషియన్స్ ..సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసారు. సిద్దం మనోహార్ కెమేరా వర్క్ బాగుంది. వైజాగ్ ని చాలా బాగా చూపించారు. సస్సెన్స్ థ్రిల్లర్ జానర్ కు తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని గిఫ్టన్ అందించారు. పాటలు ఓకే. ఈ థ్రిల్లర్ కి మధ్య మధ్యలో వచ్చే పాటలూ అలరించలేకపోయాయి. ఉడగండ్ల సాగర్ ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదనిపించింది. దొలూరి నారాయణ ఆర్ట్ వర్క్ , అట్లూరి నారాయణ రావు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో …
హీరో ఉదయ్ శంకర్ నటనలో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. శాండీగా జెన్నీఫర్ నటన ఎలా ఉన్నా గ్లామర్ గా కొంతవరకూ మోసింది. హీరో ఫ్రెండ్ గా ఎప్పటిలాగే మధునందన్ తనదైన టైమింగ్ తో అలరించాడు. , సుమన్, శ్రీకాంత్ అయ్యంగార్ నటన మ్రొక్కుబడిగా సాగింది.
ప్లస్ లు :
కొత్తగా అనిపించే థీమ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
మైనస్ లు:
తనకు తోచినట్లు లాజిక్ లేకుండా రాసుకున్న సీన్స్
డైరక్షన్
ఎడిటింగ్
చూడచ్చా?
సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను నచ్చేవాళ్లకు ఈ గర్ల్ ప్రెండ్ కూడా నచ్చుతుంది.
నటీనటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, సీనియర్ హీరో సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు
సినిమాటోగ్రఫి : సిద్దం మనోహార్
మ్యూజిక్: గిఫ్టన్,
ఎడిటర్: ఉడగండ్ల సాగర్
ఆర్ట్: దొలూరి నారాయణ
నిర్మాత : అట్లూరి నారాయణ రావు
Runtime: 2 hours 10 minutes.
దర్శకత్వం : గురు పవన్
రిలీజ్ డేట్: 2022-11-11