నమో మూవీ జూన్ 7 విడుదల

సర్వైవల్ కామెడీ జానర్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా నమో అనే సినిమా రాబోతోంది. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

విశ్వంత్, అనురూప్ కాంబోలో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీ నుంచి వదిలిన పోస్టర్, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూన్ 7న సినిమాను విడుదల చేయబోతోన్నట్టుగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో హీరోలిద్దరూ వింత ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి కనిపిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరామెన్‌గా రాహుల్ శ్రీవాత్సవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా క్రాంతి ఆచార్య వడ్లూరి ఎడిటర్‌గా సనల్ అనిరుధన్ పని చేశారు.

తారాగణం :

విశ్వంత్ దుద్ధుంపూడి, అనురూప్ కటారి, విస్మయ తదితరలు

సాంకేతిక బృందం :

బ్యానర్ : శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాత : ఏ. ప్రశాంత్
దర్శకులు : ఆదిత్య రెడ్డి కుందూరు
కెమెరామెన్ : రాహుల్ శ్రీవాత్సవ్
సంగీతం : క్రాంతి ఆచార్య వడ్లూరి
ఎడిటర్ : సనల్ అనిరుధన్