నమో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

యంగ్ టీం అంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి.. నమో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భీమనేని శ్రీనివాసరావు

విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ.ప్రశాంత్ నిర్మించిన చిత్రం నమో. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆదిత్య నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ చిత్రంతో ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. అతను ఎంతో కష్టపడతాడు. మంచి టాలెంట్ ఉంది. ఆదిత్య ఈ సినిమాతో తనని తాను నిరూపించుకుంటాడనిపిస్తోంది. సినిమాలోని పాత్రలు కష్టాలు పడుతుంటే.. చూసే ప్రేక్షకులకు ఫన్ వస్తుంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలను థియేటర్ వరకు తీసుకు రావడమే గొప్ప విషయం. యంగ్ టీం కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అని అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. నన్ను పెద్ద సినిమా ఫంక్షన్‌లకు పిలిచినా వెళ్తాను. చిన్న సినిమా ఈవెంట్‌లకు ఆహ్వానించినా వస్తాను. కానీ చిన్న చిత్రాల ప్రమోషన్స్‌కి వస్తే.. వారికి ఎంతో సాయం చేసినట్టుగా అవుతుంది. హీరోయిన్ విస్మయ తెలుగమ్మాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసింది. మంచి స్టార్ హీరోయిన్ అయ్యే సత్తా ఉన్న నటి. కొత్త దర్శక, నిర్మాతలు ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్నారు. కథను నమ్మి సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు ఎప్పుడూ విజయం చేకూరాలి. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న ఆదిత్యకు ఆల్ ది బెస్ట్. విశ్వంత్ మంచి నటుడు. మంచి టాలెంట్ ఉన్న నటుడు. ఆయనకు ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి అని అన్నారు.

రోమ్ భీమన మాట్లాడుతూ.. మా పురుషోత్తముడు టీజర్‌ను ఈ స్టేజ్ మీదే రిలీజ్ చేశాం. ఇప్పుడు నమో ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. నమో అనేది అందరికీ సుపరిచితం. టైటిల్ చాలా బాగుంది. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం ఉంది. ఇక ఆ టెన్షన్‌ను పోగొట్టేందుకు నమో రాబోతోన్నట్టుగా ఉంది. విశ్వంత్ సినిమాలు చూస్తుంటాను. పెద్ద హీరో అయ్యే ఫీచర్స్ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను తీయడం ఈజీ. కానీ రిలీజ్ చేయడం కష్టం. ఈ మూవీని అందరూ ఆదరించి విజయవంతం చేయాలి అని అన్నారు.

ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ.. మా ఈవెంట్‌కు వచ్చిన గురువు భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ గారికి థాంక్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రశాంత్ గారు సినిమాను నిర్మించారు. మంచి కథకి, సబ్జెక్ట్‌కి విశ్వంత్ లాంటి మంచి హీరో దొరకడంతోనే నమో సినిమాగా మారింది. అనురూప్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. విస్మయ మంచి నటి. రాహుల్ శ్రీ వాస్తవ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ట్రైబల్ సెట్‌ను కిరణ్ కుమార్ అద్బుతంగా వేశారు. క్రాంతి ఆచార్య నాకు చిన్నతనం నుంచి స్నేహితుడు. చక్కని సంగీతం ఇచ్చారు. నా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ వీక్షించి విజయవంతం చేయండి అని అన్నారు.

విశ్వంత్ దుద్దంపూడి మాట్లాడుతూ.. నమో నాకు కేవలం ఓ సినిమా కాదు. నాకు ఇదొక ఎమోషన్. టీం అంతా కలిసి ఎంతో సంతోషంగా పని చేశాం. ఓ ఫ్యామిలీలా కలిసి షూటింగ్ చేశాం. ఆదిత్య రాసిన పాత్రలు అద్భుతంగా వచ్చాయి. లాజిక్స్ పక్కన పెట్టి మ్యాజిక్ చూడండి. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా పైసా వసూల్ చిత్రం అవుతుంది. అనురూప్ చాలా టాలెంటెడ్. విస్మయ చక్కగా నటించింది. నాకు అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థాంక్స్ అని అన్నారు.

నిర్మాత ప్రశాంత్ మాట్లాడుతూ.. ఆదిత్య, డీఓపీ రాహుల్ నాకు మంచి స్నేహితులు. వారి వల్లే ఈ ప్రాజెక్ట్ నిర్మించాను. ఆ ఇద్దరికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. విశ్వంత్, అనురూప్, విస్మయలు చాలా కష్టపడతారు. రిమోట్ ఏరియాలో టీం అంతా కష్టపడింది. క్రాంతి ఆచార్య మంచి సంగీతాన్ని ఇచ్చారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని అన్నారు.

అనురూప్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్ట్‌తో ఇక్కడి వరకు వచ్చాను. మా నమో సినిమా జూన్ 7న రాబోతోంది. సినిమా కోసం టీం అంతా కష్టపడింది. మోహన్ అనే పాత్ర మా దర్శకుడు ఆదిత్యదే అనిపిస్తుంది. అంత మంచి కారెక్టర్‌ను నాకు ఇచ్చినందుకు థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ గారికి థాంక్స్. ప్రశాంత్ గారి వల్ల ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. విస్మయ చక్కగా నటించింది. విశ్వంత్ నాకు సోదరుడు లాంటి వాడు. ఎంతో సపోర్టివ్‌గా నిలిచాడు. మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి అని అన్నారు.

విస్మయ శ్రీ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో సినిమాను ఎంతో కష్టపడి షూట్ చేశాం. ప్రశాంత్ గారి నిర్మాణంలో రెండు చిత్రాలు చేశాను. మూడో సినిమా కూడా చేయబోతున్నాం. ఆదిత్య గారు బయటకు కనిపించే అంత సైలెంట్ అయితే కాదు (నవ్వుతూ). విశ్వంత్ గారు సెట్స్‌లో ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. అనురూప్ మంచి ఫ్రెండ్ అయ్యారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా అని అన్నారు.