నరకాసుర సినిమా లిరికల్ సాంగ్ విడుదల

Published On: September 21, 2023   |   Posted By:

నరకాసుర సినిమా లిరికల్ సాంగ్ విడుదల

రక్షిత్ అట్లూరి నరకాసుర సినిమా నుంచి నిన్ను వదిలి లిరికల్ సాంగ్ రిలీజ్

పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా నరకాసుర. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో నరకాసుర మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి నిన్ను వదిలి అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

శ్రీరామ్ తపస్వి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను ఏఐఎస్ నాఫాల్ రాజా బ్యూటిఫుల్ కంపోజిషన్ లో విజయ్ ప్రకాష్, చిన్మయి శ్రీపాద హార్ట్ టచింగ్ గా పాడారు. నిన్ను వదిలి నేనుండగలనానన్ను వదిలి నీవుండగలవాఇది నీ వాంఛ గాదే, నాకు ఏ వాంఛ లేదేపంచభూతమ్ములు అనుకున్నావిధిని ఆపవులేఅంటూ ప్రేమలోని ఎమోషనల్ బాండింగ్ చూపిస్తూ సాగుతుందీ పాట. అందమైన ఈ పాటను అంతే అందంగా పిక్చరైజ్ చేసినట్లు లిరికల్ సాంగ్ లోని విజువల్స్ ద్వారా తెలుస్తోంది.

నటీనటులు :

రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు

సాంకేతిక నిపుణులు :

బ్యానర్స్ : సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిల్మ్ మేకర్స్
నిర్మాత : డాక్టర్ అజ్జా శ్రీనివాస్
ఎడిటింగ్ : సిహెచ్ వంశీకృష్ణ
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
సంగీతం : ఏఐఎస్ నాఫాల్ రాజా