నాగార్జున సిమెంట్స్ బ్రాండ్ అండాసిడ‌ర్ గా మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్
 
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవ‌లే వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపించ‌న సంగ‌తి తెలిసిందే.
 
ఇక వ‌రుణ్ తేజ్ బ్రాండ్స్, అండోర్స్ మెంట్స్ ఫీల్డ్ లో కూడా త‌న దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే ప‌లు దేశియ బ్రాండ్లుకి అండార్స్ చేస్తున్న వ‌రుణ్ తేజ్ తాజాగా ప్ర‌ముఖ సిమెంట్ బ్రాండ్, నాగార్జున సిమెంట్స్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేందుకు అంగీక‌రించారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను నాగార్జున సిమెంట్స్ వారు అధికారికంగా విడుద‌ల చేశారు.
 
నాగార్జున సిమెంట్స్ కి సంబంధించిన పాపుల‌ర్ ట్యాగ్ లైన్స్(మీ అనుంబంధ‌మే నా బ‌లం, ప్ర‌తి సౌధంలో మొన‌గాడై నిలిచి) తో ఈ పోస్ట‌ర్స్ ని విడుద‌లైయ్యాయి. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం బాక్సింగ్ లో స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా రానున్నాయి.