నేను స్టూడెంట్ సార్ మూవీ జూన్ 2 విడుదల

Published On: May 26, 2023   |   Posted By:

   నేను స్టూడెంట్ సార్ మూవీ జూన్ 2 విడుదల

బెల్లంకొండ గణేష్, రాఖీ ఉప్పలపాటి, నాంది సతీష్ వర్మ, ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్స్ నేను స్టూడెంట్ సార్ కు యూ/ఏ సర్టిఫికెట్  జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల

స్వాతిముత్యం సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సార్ తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పై నాంది సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి.

జూన్ 2న నేను స్టూడెంట్ సార్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిందని సెన్సార్ బోర్డ్ సభ్యులు నేను స్టూడెంట్ సార్ టీం ని అభినందించారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ చాలా థ్రిల్లింగ్, గ్రిప్పింగ్ గా వుందని కితాబిచ్చారు.

ఈ చిత్రంలో గణేష్ కు జోడిగా అవంతిక దస్సాని నటిస్తున్నారు. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అనిత్ మాదాడి కెమెరామెన్ గా పని చేస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నారు.

నటీనటులు:

బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: నాంది సతీష్ వర్మ
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: అనిత్ మధాడి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్