పాపం పసివాడు వెబ్ సిరీస్ సెప్టెంబర్ 29 విడుదల

Published On: September 30, 2023   |   Posted By:

పాపం పసివాడు వెబ్ సిరీస్ సెప్టెంబర్ 29 విడుదల

ఆహా ఒరిజినల్ సిరీస్ పాపం పసివాడుకు అమితాబ్ బచ్చన్ అండ బిగ్ బి పోస్టుతో సిరీస్‌పై ప్రేక్షకుల చూపు

యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్ శ్రీరామ చంద్ర నటించిన ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ పాపం పసివాడు. సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సిరీస్ మీద ప్రేక్షకుల చూపు పడేలా చేశారు. ఒక్క పోస్టుతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. ఈ సిరీస్ టీజర్‌ను అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలలో షేర్ చేశారు. దాంతో పాపం పసివాడు మీద అంచనాలు మరింత పెరిగాయి.
ఆహా ఓటీటీలో సెప్టెంబరు 29న పాపం పసివాడు ప్రీమియర్‌ కానుంది. ది వీకెండ్ షో నిర్మించిన ఈ సిరీస్‌లో 5 ఎపిసోడ్లు ఉన్నాయి. క్రాంతి అనే 25 ఏళ్ల యువకుడు ఎదుర్కొనే హృదయ విదారక సంక్లిష్టతలు, ప్రేమ చుట్టూ కథ సాగుతుంది. అతని జీవితం అల్లకల్లోలంగా, అస్తవ్యస్తంగా మారినప్పుడు వీక్షకులు ఊహించని మలుపులతో కథ సాగుతూ వినోదం పంచుతుంది. అతని జీవితంలో ముగ్గురు అమ్మాయిలు ఎవరు? అనేది ఆసక్తికరం. పాపం పసివాడులో రాశి సింగ్, శ్రీ విద్య మహర్షి తదితరులు నటించారు.