పులి మేక మూవీ ట్రైల‌ర్‌ విడుదల

Published On: February 21, 2023   |   Posted By:

పులి మేక మూవీ ట్రైల‌ర్‌ విడుదల

డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆవిష్కరించిన పులి మేక‌ స‌రికొత్త పాత్ర‌లో ఆక‌ట్టుకుంటోన్న‌ లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌

సీరియ‌ల్ థ్రిల్ల‌ర్స్‌కి, సైకో కిల్ల‌ర్ వెబ్‌సీరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉన్న టైమ్ ఇది. లాక్‌డౌన్‌లో మొద‌లైన ఈ ఫీవ‌ర్‌, సిరీస్ ల‌వ‌ర్స్‌లో ఇంకా త‌గ్గ‌లేదు. అలాంటివారికి డ‌బుల్ థ్రిల్లింగ్ క‌లిగించ‌నుంది పులి మేక‌. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పులి మేక‌ ట్రైల‌ర్‌లోనూ అదే స్పీడ్ క‌నిపిస్తోంది. స్టార్టింగ్ టు ఎండింగ్ రేసీ నెరేష‌న్ సిరీస్ మీద స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తోంది.

ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్ర‌రీలో ఫిబ్ర‌వ‌రి 24న‌ మ‌రో బెస్ట్ ఒరిజిన‌ల్‌గా జాయిన్ కావ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది పులి మేక. ఈ ఒరిజిన‌ల్ కోసం జీ 5 కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌తో జాయిన్ అయ్యింది. లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్‌, సిరి హ‌న్మంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సోమ‌వారం ఈ ఒరిజిన‌ల్ ట్రైల‌ర్‌ను డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే చావు చెప్పిరాదు, వ‌చ్చిన‌ప్పుడు త‌ప్పించుకోవ‌డం సాధ్యం కాదు అంటూ మొదల‌వుతుంది పులిమేక ట్రైల‌ర్‌. ఆ డైలాగును చెప్పిన తీరు, బ్యాక్‌గ్రౌండ్‌లో క‌నిపించే దృశ్యాలు బెస్ట్ టేకాఫ్‌గా అనిపించాయి. డైలాగ్ విన‌గానే భ‌గ‌వ‌ద్గీత గుర్తుకొస్తుంది. ఒన్‌మంత్ బ్యాక్ షామిర్‌పేట్ లేక్ ద‌గ్గ‌ర ఎస్ ఆర్ న‌గ‌ర్ ఎస్ ఐ అనిల్ మ‌ర్డ‌ర్ జ‌రిగింది. ఆ మ‌ర్డ‌ర్ చేసింది, ఈ మ‌ర్డ‌ర్ చేసింది ఒక్క‌రే సార్ అని చెబుతూ ప్ర‌భాక‌ర్ శ‌ర్మ కేర‌క్ట‌ర్‌లో ప‌రిచ‌య‌మ‌వుతారు ఆది. పోలీస్ అఫిషియ‌ల్‌గా క‌నిపిస్తారు సుమన్‌. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి ఒక సైకో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని టార్గెట్ చేశాడ‌ని అర్థ‌మ‌వుతుంది.

ఈ కేసును డీల్ చేయ‌డం కోసం అపాయింట్ అవుతుంది ఐపీయ‌స్ ఆఫీస‌ర్ కిర‌ణ్ ప్ర‌భ కేర‌క్ట‌ర్‌లో లావ‌ణ్య‌. సీరియ‌స్ లుక్స్ లో, ఖాకీ యూనిఫార్మ్‌కి గ‌ట్టిగా న్యాయం చేశారు లావ‌ణ్య‌. త‌న‌కంటూ ఓ టీమ్‌ని సెల‌క్ట్ చేసుకుని ఈ కేసును డీల్ చేసిన‌ట్టు మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. ఈ ఛేజింగ్‌లో ఆమెకు సాయం చేస్తాడు ప్ర‌భ‌. పులి మేక క‌థ‌లో పులి ఎవ‌రో తెలియాలి అంటూ జ‌రిగే ఇన్వెస్టిగేష‌న్ ఆడియ‌న్స్‌ని ఎంగేజ్ చేస్తుంది. జంతువులాంటి మ‌నిషి కోసం కిర‌ణ్ ప్ర‌భ అండ్ ప్ర‌భాక‌ర్‌ టీమ్ చేసే ప్ర‌య‌త్నం ఫ‌లించిందా?
ఆ మేడ‌మ్ చాలా డేంజ‌ర్ కొడ్తుంది అని అనుకునేవాళ్ల ఫీలింగ్స్ నిజ‌మ‌య్యాయా? లాక్‌డౌన్‌లో ప్ర‌భాక‌ర్‌ చూసిన సీరీస్‌ల వ‌ల్ల కేసుకు ఏమైనా హెల్ప్ జ‌రిగిందా? వంటి వివ‌రాలు ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

నైట్ ఎఫెక్ట్‌లో క‌నిపించే దృశ్యాలు, ఎంగేజింగ్‌గా అనిపించిన రీరికార్డింగ్ ఈ సీరీస్‌కి హైలైట్‌. కోన వెంక‌ట్, వెంక‌టేష్ కిళారు క‌థ‌, కోన వెంక‌ట్ క్రియేష‌న్‌, చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి డైర‌క్ష‌న్‌, ర‌మేష్ కె మ‌హేష్ కెమెరా, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం సీరీస్‌కి హైలైట్ అవుతాయి.

న‌టీన‌టులు :

కిర‌ణ్ ప్ర‌భ‌గా లావ‌ణ్య త్రిపాఠి, ప్ర‌భాక‌ర్ శ‌ర్మ‌గా ఆది సాయి కుమార్, అనురాగ్ నారాయ‌ణ్‌గా సుమన్‌, దివాక‌ర్ శ‌ర్మ‌గా గోప‌రాజు, రాజాగా క‌రుణాక‌ర్ శ‌ర్మ, సిరిగా ప‌ల్ల‌వి, శ్రీనివాస్‌గా పాండు రంగారావు, స్పంద‌న‌గా ప‌ల్ల‌వి శ్వేత న‌టిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం :

బ్యాన‌ర్స్‌: జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌
క‌న్విన్సిడ్, క్రియేటెడ్‌: కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌కుడు : చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి.కె
సినిమాటోగ్ర‌ఫీ: రామ్ కె.మ‌హేష్‌
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌