పెదకాపు 1 మూవీ జాతర పాట విడుదల

Published On: September 19, 2023   |   Posted By:

పెదకాపు 1 మూవీ జాతర పాట విడుదల

విరాట్ కర్ణ, శ్రీకాంత్ అడ్డాల, మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ పెదకాపు-1 నుండి జాతర పాట విడుదల

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూరల్ న్యూ ఏజ్ పోలిటికల్ యాక్షనర్ పెదకాపు-1 ఇంటెన్స్ , గ్రిప్పింగ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలని పెంచింది. ఫస్ట్ సింగిల్- రొమాంటిక్ మెలోడీ సంచలనంగా మారింది. మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా మేకర్స్ సెకెండ్ సింగిల్- జాతర పాటని విడుదల చేశారు.

మిక్కీ జె మేయర్ స్వరపరిచిన పాట భారీ డ్రమ్ సౌండ్‌లతో సాంప్రదాయం బీట్స్ తో ఆకట్టుకుంది. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో, సాంప్రదాయ దుస్తులలో ఉన్న వ్యక్తులతో జాతర వాతావరణం నిండుగా కనిపించింది. అనురాగ్ కులకర్ణి తన పవర్ ఫుల్ వాయిస్ తో మరింత ఉత్సాహాన్ని నింపాడు. సాయి చరణ్, హైమత్ కోరస్ అదనపు ఎనర్జీ జోడించింది. కళ్యాణచక్రవర్తి త్రిపురనేని అద్భుతమైన సాహిత్యంతో అమ్మవారి పరాక్రమాన్ని వర్ణించారు.

రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రఫీ విజువల్స్‌కు మరింత అందం జోడించింది. విరాట్ కర్ణ కొన్ని వండర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ చేశాడు. పాటలో ఇంటెన్స్ గా కనిపించాడు. ఈ పాట ఇన్స్టంట్ హిట్, అన్ని జాతర ఉత్సవాల్లో ప్లే అవుతుంది.

ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షించగా రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

పెదకాపు-1 సెప్టెంబర్ 29న విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు :

విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు.

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి
సంగీతం – మిక్కీ జె మేయర్
డీవోపీ – చోటా కె నాయుడు
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్