ప్రభాస్20 చిత్రo మూడో షెడ్యూల్ పూర్తి
 
మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రభాస్20.
 
బాహుబలి, సాహో సక్సెస్ ఫుల్ చిత్రాల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఇవాళ్టి నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వచ్చింది. గోపికృష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థతో అనుబంధంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
 
బిగ్ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో వస్తోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేక సెట్ లో ప్రభాస్, పూజా హెగ్డే పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. 
 
కమల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తుండడం విశేషం. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో మొదలైన ఈ చిత్ర షెడ్యూల్ పూర్తి అయ్యింది, దీంతో మూడో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
 
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే
 
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
ఎడిటర్ :శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్
సమర్పణ : గోపికృష్ణ మూవీస్ కృష్ణం రాజు
బ్యానర్ : యూవీ క్రియేషన్స్ నిర్మాతలు: ప్రమోద్, వంశీ
దర్శకుడు : కే కే రాధాకృష్ణ కుమార్