ప్రొడ్యూసర్ దిల్ రాజు – శిరీష్ నిర్మాణంలో రవి కిరణ్ కోలా కొత్త చిత్రం ప్రకటన

Published On: September 26, 2023   |   Posted By:

ప్రొడ్యూసర్ దిల్ రాజు – శిరీష్ నిర్మాణంలో రవి కిరణ్ కోలా కొత్త చిత్రం ప్రకటన

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రవి కిరణ్ కోలా కొత్త చిత్రం

వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఎప్పుడూ ముందుంటారు. ఓ వైపు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ సినిమాలను రూపొందిస్తున్నారు. తాజాగా దిల్ రాజు నిర్మాతగా రాజావారు రాణిగారు దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సిినిమా తెరకెక్కనుంది.

రాజావారు రాణిగారు సినిమా తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు షోరన్నర్‌గా వ్యవహరించిన రవి కిరణ్ కోలా మరోసారి మెగా ఫోన్ పట్టనున్నారు. మరో వైవిధ్యమైన కథాంశంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించటానికి దిల్ రాజు, శిరీష్, రవి కిరణ్ కోలా సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.