కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ ఫిబ్రవరి 7 రీ రిలీజ్

Published On: January 31, 2024   |   Posted By:

కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ ఫిబ్రవరి 7 రీ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్. దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం రీ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నట్టి కుమార్ తెలిపారు. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుందని నట్టి కుమార్ వెల్లడించారు. జర్నలిస్ట్ రాంబాబు పాత్రలో పవన్ కళ్యాణ్, కెమెరామెన్ గంగ పాత్రలో తమన్నా కనిపిస్తారు. వీరిద్దరు సొసైటీలో జరిగే అరాచకాలను ఎలా ఎదుర్కొన్నారు అన్న కధాంశంతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. మణిశర్మ సంగీతం, శ్యాం కె.నాయుడు ఛాయాగ్రహణం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ఆయన వివరించారు.