ఫియర్ మూవీ షూటింగ్ పూర్తి

Published On: February 19, 2024   |   Posted By:

ఫియర్ మూవీ షూటింగ్ పూర్తి

వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ ఫియర్ షూటింగ్ పూర్తి

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న ఫియర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి మరియు సామ సురేందర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.

చిత్రీకరణ పూర్తైన సందర్భంగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. షూటింగ్ ప్రారంభించుకుని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసుకోవడం విశేషం. డైరెక్టర్ గా మొదటి సినిమా అయినా హరిత గోగినేని ఎంతో క్లారిటీతో ఫియర్ సినిమాను చిత్రీకరించారు. వేదిక కోపరేషన్, ఇతర ఆర్టిస్టుల సపోర్ట్, మూవీ టీమ్ పక్కా ప్లానింగ్ చేశారు కాబట్టే ఇంత తక్కువ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేయగలిగారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. సినిమా ఔట్ పుట్ అద్భుతంగా వచ్చిందని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు.

నటీనటులు :

వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు

టెక్నికల్ టీమ్ :

మ్యూజిక్ : అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్రూ
ఎడిటింగ్ : గ్యారీ బీ హెచ్
నిర్మాత : ఏఆర్ అభి
రచన, దర్శకత్వం : హరిత గోగినేని