బంగార్రాజు మూవీ రివ్యూ

Bangarraju-.jpg

నాగార్జున, నాగ చైతన్య ‘బంగార్రాజు’రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👍

సంక్రాంతి కానుకగా మంచి అంచనాల మధ్య ఈ సినిమా రిలీజైంది.  ఇది 2016 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్.  ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంత పెద్ద హిట్ అయినా సరే.. ‘బంగార్రాజు’ స్క్రిప్టును ఒక పట్టాన ఓకే చేయలేదు నాగార్జన. ఒక రకంగా కళ్యాణ్ ఈ సినిమా స్క్రిప్టు విషయంలో చాలా కష్టపడ్డారని అన్నారు. మరి అన్నేళ్లు వెయిట్ చేయంచిన నాగ్.. అందుకు తగ్గ కథతోనే మన ముందుకు వచ్చాడా.ముందు నుంచే ఇది పండుగలాంటి సినిమా.. పండుగ కోసమే తీసిన చిత్రమని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అక్కినేని తండ్రీకొడుకులు నటించిన సినిమా కావడం.. బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కావడంతో బజ్ క్రియేట్ అయింది. ‘బంగార్రాజు’ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫెస్టివల్ కు ఆడియన్స్ కోరుకునే పర్ఫెక్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకునేలా చేసింది. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉందా, సినిమా కథేంటి…ఈ చిత్రం ఎలా ఉంది?  చూద్దాం!

కథేంటి

బంగార్రాజు (నాగార్జున) మనవడు  చిన్న బంగార్రాజు (నాగచైతన్య) కూడా అచ్చం తాత లాగే రసికుడు..ప్లే బోయ్. అతను పెళ్లీడుకొచ్చేసరికి సత్తెమ్మ చనిపోయి బంగార్రాజు దగ్గరికే వెళ్లిపోతుంది. దీంతో చుట్టూ ఉన్న బంధువులంతా చిన్న బంగార్రాజును అమాయకుణ్ని చేసి ఆడేసుకుంటూంటారు.  పెళ్లి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అంతేనా అతని ఏటిట్యూడ్ తో అతన్ని చంపడానికి శత్రువులు తయారవుతారు. ఇవన్నీ స్వర్గంలో ఉన్న బంగార్రాజుకు ఈ మధ్యనే పైకి వెళ్లిన  సత్తెమ్మ (రమ్యకృష్ణ) చెప్తుంది. యమధర్మరాజు ఫర్మషన్ తో  చిన్న బంగార్రాజుకు పెళ్లి చేసి శత్రువుల దాడి నుంచి కాపాడ్డానికి  కిందికి వస్తాడు. అప్పుడు ఏమైంది..చిన్న బంగార్రాజుని తాత బంగార్రాజు సేవ్ చేసాడా..పెళ్లి చేసాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

చైతుని డమ్మీ చేసే స్క్రీన్ ప్లే

సోగ్గాడే చిన్నినాయనా సినిమా వచ్చినపుడు దానికి సీక్వెల్ ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలకి ఆలోచన వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ ప్రపోజల్ నాగార్జున ముందు పెట్టాడు. ఈ సినిమా చేయడానికి నాగ్ ఓకే అన్నాడే కానీ.. స్క్రిప్టు ఓకే చేయలేదు. అప్పటి నుంచీ ఆశ్చర్యకరంగా ఈ స్క్రిప్టు మీద మూణ్నాలుగేళ్లు పని చేశాడు కళ్యాణ్. అయితే ఈ సినిమా చూస్తుంటే అంత విషయం ఉన్నట్లు కనపడదు. ఫైనల్ వెర్షన్ ఇలా ఉందంటే మొదట వెర్షన్ ఎలా ఉందో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సీక్వెల్ ల్ కు సీక్వెల్ లక్షణాలు ఏమీ కనపడవు. సరైన కథా లక్షణాలు కనపడవు. మొదటి సినిమాలో కొడుకు కాపురం చక్క దిద్దాడు.. ఈ సినిమాలో మనవడు కాపురం చక్క దిద్దాలి…ఇదే స్టోరీ లైన్ ..దాని చుట్టూ కొన్ని పాత వాసనలు..మరికొన్ని కొత్త సీన్స్. అయినా నాగచైతన్యని డమ్మీ అవుతున్నాడనే విషయం ఎందుకనో నాగార్జున గమనించలేదు. తనే ఆ పాత్ర లోకి ప్రవేశిస్తే ఇంక చైతన్య చేసేదేమి ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకు వెళ్తున్న చైతును వెనక్కి లాగినట్లైంది.

‘సోగ్గాడే..’ తర్వాత అతను వెంటనే వర్క్ చేసిన స్క్రిప్టు ఇదే. అప్పుడే చేసేస్తే కాస్త ఇంట్రస్ట్ ఉండేదేమో. కానీ మధ్యలో ఈ డైరక్టర్ రారండోయ్ వేడుక చూద్దాం, నేల టిక్కెట్టు సినిమాలు చేశాడు. మళ్లీ వెనక్కి వచ్చి ‘బంగార్రాజు’ మీదే పని చేశాడు. ‘నేల టిక్కెట్టు’ తర్వాత కూడా ఈ సినిమా పట్టాలెక్కడానికి మూడేళ్లకు పైగానే సమయం పట్టింది. ఈ గ్యాప్ లో ప్రపంచం మారిపోయింది. ఆ విషయం దర్శకుడు గమనించినట్లు లేరు. దానికి తోడు తాత పోలికలతో మనవడు పుట్టినట్లుగానే ఈ స్క్రిప్టు కూడా సోగ్గాడే పోలికలతోనే పుట్టడంతో అదే సినిమా మరోసారి చూస్తున్నామా అనే డౌట్ కొన్ని సార్లు వస్తుంది. దానికి తోడు చైతూ-కృతి మధ్య వచ్చే రొమాంటిక్ ఇంట్రస్ట్ లో పస లేదు. అవేమీ పండలేదు. వెన్నెల కిషోర్ ను సైతం సరిగా వాడుకునే సీన్స్ రాసుకోలేదు.  ఏదైమైనా ఫస్టాఫ్ లో కలర్ ఫుల్ సాంగ్స్ .. బంగార్రాజు పాత్ర హడావిడి తప్ప  చెప్పుకోవడానికి ఏమీ లేదు.

టెక్నికల్ ఫెరఫార్మన్స్

అనూప్ రూబెన్స్ పాటలు వినటానికి కన్నా చూడటానికి బాగున్నాయి.   లడ్డుండా.. బంగారా పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. కెమెరా వర్క్ మాత్రం బాగుంది.సినిమా అంతా కలర్ ఫుల్ గా అనిపించింది. నిర్మాతగా నాగార్జున బాగా ఖర్చు పెట్టారు. కళ్యాణ్ కృష్ణ.. సత్యానంద్ కలిసి చేసిన స్క్రీన్ ప్లే నీరసంగా సాగింది.  కథ పరంగా ఈ సినిమా నుంచి కొత్తదనం ఆశించరు కానీ.. వాళ్లు కోరుకునే ఎంటర్టైన్మెంట్  అందించడంలో కళ్యాణ్.. ఫెయిలయ్యామయ్యారు.  చిన్న బంగార్రాజు పాత్ర డిజైన్ కుదరలేదు. డైరక్షన్ కూడా సోసోగానే సాగింది.

నటీనటులు:

‘బంగార్రాజు’గా నాగ్ ఫెరఫెక్ట్ ఆప్షన్. ఆయన్ని తప్ప మరెవరినీ ఊహించలేం.  గోదారి యాస నాగ్ అద్భుతంగా పలికారు. చిన్న ‘బంగార్రాజు’గా నాగచైతన్య సోసోగా అనిపించారు. కృతి శెట్టి నటన కన్నా అందంగా మెరిసింది.  రమ్యకృష్ణ ఎప్పటిలాగే హుందాగా కనిపించింది. రావ్ రమేష్, సంపత్ రాజ్, వెన్నల కిషోర్ .. పరిధి మేర చేశారు.

చూడచ్చా
పండగ కాలక్షేపం గా అయితే ఓ లుక్కేయచ్చు

నచ్చినవి :
కలర్ ఫుల్ సాంగ్స్ ,
విలేజ్ నేపధ్యం
క్లైమాక్స్

నెగిటివ్ లు:

రొటీన్ స్క్రీన్ ప్లే
ఎమోషనల్ కనిక్టవిటీ లేకపోవటం

తెర వెనక..ముందు

బ్యానర్స్ :  జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య,  రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు.
స్క్రీన్ ప్లే :  సత్యానంద్
సంగీతం :  అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ :  యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్  : బ్రహ్మ కడలి
కథ, దర్శకత్వం  : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత :  అక్కినేని నాగార్జున
రన్ టైమ్:2hr 40 Mins
విడుదల తేదీ: 14 జనవరి,2021