బబుల్గమ్ మూవీ సక్సెస్ మీట్ ఈవెంట్

Published On: January 1, 2024   |   Posted By:

బబుల్‌గమ్ మూవీ సక్సెస్ మీట్ ఈవెంట్

బబుల్‌గమ్ కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: పోస్ట్ రిలీజ్ సెలబ్రేషన్స్ లో హీరో రోషన్ కనకాల& టీం

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయమైన చిత్రం బబుల్‌గమ్ ఘన విజయాన్ని అందుకుంది. మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించింది. డిసెంబర్ 29న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ పోస్ట్ రిలీజ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది.

పోస్ట్ రిలీజ్ సెలబ్రేషన్స్ లో హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ.. బబుల్‌గమ్ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది ప్రేమ, ఆత్మ గౌరవానికి సంబధించిన కథ. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా జరిగుంటుంది. అందుకే ఈ చిత్రానికి అందరూ కనెక్ట్ అవుతున్నారు. రెస్పాన్స్ క్రేజీ గా వుంది. ఫైనల్ గా ఒక మాట.. మాకు కావాల్సింది మేము లాక్కున్నాం. నచ్చినట్లు మార్చుకున్నాం. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు

దర్శకుడు రవికాంత్ పేరేపు మాట్లాడుతూ.. బబుల్‌గమ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ టూర్ చేస్తున్నాం. ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

చైతు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సినిమాకి రెస్పాన్స్ అద్భుతంగా వుంది. రోషన్ నటనకు చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. మానస అందంగా వుంది. రోషన్, నేను చేసిన సన్నివేశాలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది అన్నారు.

శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. రవికాంత్ ఈ కథని ఈతరంకు తగ్గట్టు తీశారు. సినిమా చూసిన వారందరికీ నచ్చింది. ఇంకా చూడనివారు తప్పకుండా చూడాలి అని కోరారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.