బాక్ చిత్రం నుంచి తమన్నా భాటియా- సుందర్ సి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

అవ్ని సినిమాక్స్ P Ltd బాక్ చిత్రం నుంచి శివానిగా తమన్నా భాటియా, శివ శంకర్‌గా సుందర్ సి పరిచయం ఈ ఏప్రిల్‌లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా తెలుగు రిలీజ్

అరణ్మనై తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ, తెలుగులో విడుదలైన అన్ని వెర్షన్లు హిట్ అయ్యాయి. ఈ హారర్కామెడీ సిరీస్ నాల్గవ ఫ్రాంచైజీ తెలుగులో బాక్ పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు.

ఈ చిత్రంలో సుందర్ సి హీరోగా నటిస్తుండగా, తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌లను మేకర్స్ రివీల్ చేయడంతో తెలుగు ప్రమోషన్స్ మొదలయ్యాయి. తమన్నాని శివానిగా పరిచయం చేసారు. ఆమె సాంప్రదాయ గెటప్‌లో కనిపిస్తుంది. సుందర్ సి శివశంకర్‌గా పరిచయం కాగా, అతని క్యారెక్టర్ పోస్టర్‌లో అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. రెండు పోస్టర్లు బాక్ లో కొన్ని స్పైన్ చిల్లింగ్ ఎలిమెంట్‌ తో ఆకట్టుకున్నాయి.

హిప్హాప్ తమిళా సంగీతం అందించగా, ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఏపీ, తెలంగాణ లో భారీ విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం :

సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ

సాంకేతిక విభాగం :

కథ & దర్శకత్వం: సుందర్ సి
నిర్మాత: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్
బ్యానర్: అవ్ని సినిమాక్స్ P Ltd.
సంగీతం: హిప్హాప్ తమిళా
సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్