Reading Time: < 1 min

బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ 2023 అవార్డులు హాయ్ నాన్న మూవీ

బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ 2023 అవార్డులు గెలుచుకున్న నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్

ప్రతిష్టాత్మకమైన బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ ఈవెంట్ అనేక మంది ప్రముఖ స్టార్స్ సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న 3 అవార్డులను గెలుచుకుంది.

హాయ్ నాన్నలో తన పాత్రకు ప్రశంసలు అందుకున్న నాని, ది బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ యాక్టర్ ఇన్ ఎ లీడ్ రోల్ 2023 అవార్డును అందుకున్నారు.

మృణాల్ ఠాకూర్, హాయ్ నాన్నాలో తన అద్భుతమైన నటనకు గాను బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఉత్తమ నటి అవార్డుని అందుకుంది.

తన అద్భుతమైన విజన్ హాయ్ నాన్నను డైరెక్ట్ చేసిన దర్శకుడు శౌర్యవ్ 2023 బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫిల్మ్‌మేకర్‌ అవార్డ్ ని అందుకున్నారు.

హాయ్ నాన్నా చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. OTT విడుదలైన తర్వాత ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో టాప్ ట్రెండ్‌లో ఉంది. మనసుని హత్తుకునే కంటెంట్, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్, బ్రిలియంట్ టెక్నికాలిటీస్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రం అనేక ఇతర అవార్డులను గెలుచుకోబోతోంది.

హాయ్ నాన్న చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.