బ్రీత్ మూవీ ట్రైలర్ విడుదల

Published On: November 14, 2023   |   Posted By:

బ్రీత్ మూవీ ట్రైలర్ విడుదల  

నందమూరి జయకృష్ణ, చైతన్యకృష్ణ, వంశీకృష్ణ ఆకెళ్ళ, బసవతారక రామ క్రియేషన్స్‌ సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ బ్రీత్ ట్రైలర్ విడుదల

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడైన నందమూరి జయకృష్ణ… బసవతారక రామ క్రియేషన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి, తొలి చిత్రంగా తన తనయుడు చైతన్యకృష్ణని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న సీట్ ఎడ్జ్  ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ టీజర్ కు  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్’బ్రీత్’ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్. షాక్, ఎక్సయిటింగ్ ఎలిమెంట్స్ తో  సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా అలరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో హోప్సిటల్ లో చేరుతారు. ఆ తర్వాత హాస్పిటల్ లో చోటు చేసుకున్న సంఘటనలు చాలా గ్రిప్పింగ్ గా థ్రిల్లింగ్ గా వున్నాయి. ‘ఇప్పటివరకూ ప్రపంచం చూడని ఓ కొత్త క్రైమ్ జరుగుతుంది”అనే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచింది.

ట్రైలర్ లో చైతన్యకృష్ణ ఇంటెన్స్ అండ్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. తన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ వున్నాయి. వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్ భద్రమ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ యూనిక్ కాన్సెప్ట్ తో సీట్ ఎడ్జ్  థ్రిల్లర్ గా బ్రీత్ ని మలిచారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది

మార్క్ కె రాబిన్ అందించిన నేపధ్య సంగీతం చాలా ఎక్సయిటింగ్ గా వుంది. రాకేష్ హోసమణి విజువల్స్ బ్రిలియంట్ గా వున్నాయి. థ్రిల్లర్ మూడ్ ని మరింతగా ఎలివేట్ చేశాయి. బి. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ క్రిస్ప్ గా వుంది.  బసవతారక రామ క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి. ఈ  సీట్ ఎడ్జ్ ఎమోషనల్ ట్రైలర్ బ్రీత్ పై చాలా క్యురియాసిటీని పెంచింది.

తారాగణం:

చైతన్యకృష్ణ, వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, భద్రమ్, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు తదితరులు

సాంకేతికవర్గం:

రచన, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల
నిర్మాత: నందమూరి జయకృష్ణ
బ్యానర్: బసవతారక రామ క్రియేషన్స్‌
డీవోపీ: రాకేష్ హోసమణి
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి